Mosque Blast : అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుళ్లు…15 మంది మృతి
అప్ఘానిస్థాన్ దేశంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.....

Mosque Blast : అప్ఘానిస్థాన్ దేశంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది. బగ్లాన్ ప్రావిన్స్ మధ్యలో ఉన్న పోల్-ఎ-ఖోమ్రీలోని తకియాఖానా ఇమామ్ జమాన్ వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మసీదులో ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించిందని బగ్లాన్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ముస్తఫా హషేమీ ధ్రువీకరించారు.
పేలుడు ఫలితంగా కొంతమంది వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇటీవల కాలంలో అప్ఘానిస్థాన్‌ను వణికించిన మరో పేలుడు ఇది. ఇటీవల భూకంపం కారణంగా దేశం భారీ వినాశనానికి గురైంది. 2021వ సంవత్సరంలో తాలిబాన్ పాలన చేపట్టినప్పటి నుంచి అప్ఘాన్ అల్లకల్లోలంగా మారింది. ఈ ఏడాది జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
అఫ్ఘానిస్థాన్ దేశం తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల తిరుగుబాటుతో పోరాడుతోంది. ఈ తిరుగుబాటు బృందం పౌరులు, విదేశీయులు, తాలిబాన్ భద్రతా బలగాలను కూడా లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నాయి.