Twitter BluTick: బ్లూటిక్‌పై మస్క్ కీలక ప్రకటన.. అవితేలే వరకు పున:ప్రారంభం ఉండదని వెల్లడి..

ట్విటర్‌లో బ్లూటిక్ సబ్‌స్క్రిప్ష‌న్‌ పున: ప్రారంభంపై ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలిపాడు. ట్విటర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని మస్క్ తెలిపాడు.

Twitter BluTick: బ్లూటిక్‌పై మస్క్ కీలక ప్రకటన.. అవితేలే వరకు పున:ప్రారంభం ఉండదని వెల్లడి..

Elon Musk

Updated On : November 22, 2022 / 11:16 AM IST

Twitter BluTick: బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ పున: ప్రారంభంపై ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. నవంబర్ 29న బ్లూటిక్‌ను మరోసారి ట్విటర్‌లో పున: ప్రారంభిస్తామని చెప్పిన మస్క్.. ప్రస్తుతం మాటమార్చాడు. బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలిపాడు. ట్విటర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని మస్క్ తెలిపాడు.

Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్

ఎలోన్ మస్క్ ట్విటర్ టేకోవర్ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ట్విటర్ బ్లూటిక్ ఖాతాదారులు ప్రతినెలా 8డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని మస్క్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతనే ట్విటర్ ఖాతాదారులకు బ్లూటిక్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ క్రమంలో భారీగా నకిలీ బ్లూటిక్ ఖాతాల పెరగడంతో మస్క్ దీనిని తాత్కాలికంగా నిలిపివేశాడు.

మస్క్ ట్విటర్‌ స్వాధీనంకు ముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను చెక్ చేశాకే బ్లూటిక్ ఇచ్చేవారు. ట్విటర్ మస్క్ చేతుల్లోకి వచ్చాక.. బ్లూటిక్ ధృవీకరించబడిన ఖాతాకు ప్రతినెలా 8 డాలర్లు రుసుము చెల్లించవలసి ఉంటుందని ప్రకటించారు. అయితే, ఈ సౌకర్యాన్ని సాధారణ వ్యక్తులకు కూడా మస్క్ అందుబాటులోకి తెచ్చాడు. ఈ క్రమంలో ట్విటర్లో నకిలీ బ్లూటిక్ ఖాతాలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. సెల‌బ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేప‌థ్యంలో 8 డాల‌ర్ల బ్లూటిక్ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించిన విషయం విధితమే.