Kabul Military Airport: కాబూల్ మిలిటరీ విమానాశ్రయం సమీపంలో బాబు పేలుడు.. 10మంది మృతి ..
ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో సైనిక విమానాశ్రయంలో ఆదివారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Afghanistan Blast
Kabul Military Airport: ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో సైనిక విమానాశ్రయంలో ఆదివారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మిలిటరీ ఎయిర్ పోర్టు ప్రధాన గేటుకు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనను తాలిబాన్ అంతర్గత వ్యవహారల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టకూర్ ధృవీకరించారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు.
Kabul Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యన్ ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి
ఉత్తర తఖర్ ప్రావిన్స్ రాజధాని తాలూకాన్ నగరంలో బుధవారం జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే మరోబాబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8గంటల సమయంలో భారీ పేలుడు శబ్ధం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మూసివేశాయి. అటువెళ్లే రహదారులన్నింటిని భద్రతా బలగాలు క్లోజ్ చేశాయి. ఈ ఘటనలో గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ పేలుడుతో విదేశీ రాయబార కార్యాలయాలు, అధ్యక్ష భవనంతో సహా పలు ప్రధాన ప్రదేశాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పేలుడుకు బాధ్యులు ఎవరనేదానిపై విచారణ చేపట్టారు.