లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 20 వేలు ఫైన్

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 20 వేలు ఫైన్

Updated On : January 6, 2021 / 8:01 AM IST

Boris Johnson has announced a new national lockdown : కొత్త రకం కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ లో వైరస్ ను అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో దఫా లాక్ డౌన్ విధించారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా…కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. వేల్స్ లో డిసెంబర్ 20వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉందనే సంగతి తెలిసిందే. 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి…బ్రిటన్ లో 407 మంది చనిపోయారు. 58 వేల 784 మందికి వైరస్ సోకిందని నిర్ధారించారు. లాక్ డౌన్ ఆరు వారాల పాటు అమల్లో ఉంటుందని, ఫిబ్రవరి రెండో వారంలో సమీక్ష నిర్వహించిన అనంతరం లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..మొదటిసారి 200 పౌండ్లు (రూ. 20 వేలు) జరిమానా విధిస్తారు. ఒకవేళ అదే తప్పు చేస్తే…అత్యధికంగా..రూ. 6.36 లక్షలు ఫైన్ కట్టాల్సిందేనని అధికారులు వెల్లడించారు. సరైన కారణం లేకుండా..బయటకు వచ్చిన వారిని జైలుకు తరలించే అధికారం పోలీసులకు కల్పించారు. చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు తెరవడానికి అనుమతించారు. అయితే..భౌతికదూరం పాటించాల్సిందేనని, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్ని కొన్ని ఆంక్షలు నడుమ అనుమతినిస్తున్నారు. 2021, జనవరి 06వ తేదీ బుధవారం నుంచి విద్యాలయాలు, దుకాణాలు, క్రీడా ప్రాంతాలు, మైదనాలు అన్ని మూసేస్తారు, అన్ని రకాల పరీక్షలను కూడా రద్దు చేశారు. స్నేహితులు, బంధువులు ఎవరైనా బయట కలుసుకోవడాన్ని నిషేధించారు. ఒకరినొకరు మాత్రమే కలుసుకోవాలనే నిబంధన పెట్టారు. కొవిడ్ వాక్సినేషన్, ఇతర వైద్య అవసరాల కోసం ఎవరైనా వెళ్లొచ్చని, తోడుగా ఒక్కరు మాత్రమే ఉండాలని అధికారులు సూచించారు.