United States : ‘బ్రైన్ ఈటింగ్ అమీబా’ కారణంగా రెండేళ్ల బాలుడు మృతి .. పిల్లల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ లక్షణాలేంటి?

రెండేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' కారణంగా చనిపోయాడు. అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?

United States : ‘బ్రైన్ ఈటింగ్ అమీబా’ కారణంగా రెండేళ్ల బాలుడు మృతి .. పిల్లల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ లక్షణాలేంటి?

United States

Updated On : July 21, 2023 / 11:37 AM IST

United States : యునైటెడ్ స్టేట్స్‌లో ఓ రెండేళ్ల బాలుడు ఫౌలెరి అనే ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడు. దీనినే ‘మెదడు తినే అమీబా’ (Brain Eating Amoeba) అంటారు. అసలు ఇది ఆ బాలుడికి ఎలా సోకింది? దీని లక్షణాలేంటి?

Urinary Tract Infection : వర్షాకాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా పాటించాల్సిన 7 చిట్కాలు !

యునైటెడ్ స్టేట్స్‌లోని నెవాడాలో రెండేళ్ల ఉడ్రో టర్నర్ బండి అనే బాలుడికి ‘నెగ్లేరియా ఫౌలెరి’ అనే ఇన్ ఫెక్షన్ సోకింది. దీనినే ‘మెదడు తినే అమీబా’ అని పిలుస్తారు. నీటిలో ఆడుతున్నప్పుడు ఆ బాలుడి శరీరంలోకి ఈ ఇన్ఫెక్షన్ చొరబడిందని డాక్టర్లు చెప్పారు. మొదట ఫ్లూ లక్షణాలతో ఉన్న బాలుడిని తల్లి బ్రియానా ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. అక్కడ వైద్య సిబ్బంది ‘మెనింజైటిస్’ ఉందని భావించారు. ఆ తరువాత మెదడు తినే అమీబాను కలిగి ఉన్నాడని చెప్పారు. ఫిబ్రవరి 2023 లో US లో 50 ఏళ్ల వ్యక్తిని కూడా ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాలు తీసింది.

 

ఇక ఉడ్రో టర్నర్ తల్లి బ్రియానా చిన్నారి మరణాన్నిఫేస్ బుక్ పోస్ట్‌లో షేర్ చేసుకుంది. ఈ వ్యాధితో 7 రోజులు పోరాడాడని, రికార్డులో అత్యధిక కాలం జీవించిన 3 వ వ్యక్తిగా తన కొడుకు ఉన్నాడని బ్రియానా పేర్కొన్నారు. తన రెండేళ్ల చిన్నారికి ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ చికిత్స అందించేందుకు నిరాకరించిందని చెప్పారు. ఆమె ఆరోపణలపై ఆరోగ్య సంస్థ స్పందించలేదు.

Respiratory Infections : వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ !

ఇక ఈ మెదడు తినే అమీబా సరస్సులు, నదులలో కనిపించే ఒక రకమైన అమీబా (ఏక కణ జీవి). ఈ అమీబా కలిగిన నీరు ముక్కులోనికి వెళ్లినపుడు ఇది మెదడుకు సోకుతుందట. అందుకే దీనిని ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ అంటారు. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కాదు ప్రాణాంతకం కూడా. కలుషిత నీరు ముక్కు మీదకు వెళ్లకుంటే ప్రజలు రోగాల బారిన పడరని గమనించాలి. ఈ అమీబా కలిగిన నీరు మెదడుకి చేరాకా 12 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయట. లక్షణాలు కనిపించిన ఒకటి నుండి 18 రోజుల లోపు వ్యక్తులు మరణిస్తారట. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ గట్టిపడటం, మూర్ఛ, కోమా ఈ అమీబా వల్ల కలిగే కొన్ని లక్షణాలట.