Brazil Bodybuilder : 19 ఏళ్ల బాడీబిల్డర్‌‌కు గుండెపోటు.. స్థూలకాయంతో పోరాడి అకాల మరణం..!

Brazil Bodybuilder : ఆరోగ్య సమస్యలతోనే పావ్లాక్ అకాల మరణం చెందాడని, అనాబాలిక్ స్టెరాయిడ్స్ అధిక మోతాదులో వాడటమే అతడి మృతికి కారణమని అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Brazil Bodybuilder : 19 ఏళ్ల బాడీబిల్డర్‌‌కు గుండెపోటు.. స్థూలకాయంతో పోరాడి అకాల మరణం..!

Brazil Bodybuilder, Whose Fight Against Obesity Went Viral, Dies At 19

Brazil Bodybuilder : బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల బాడీబిల్డర్ అకాల మరణం చెందాడు. కొన్ని ఏళ్లుగా స్థూలకాయంతో పోరాడిన మాథ్యూస్ పావ్లక్ చివరికి గుండెపోటుతో ప్రాణాలను వదిలాడు. స్థూలకాయాన్ని అధిగమించేందుకు బాడీబిల్డింగ్ ప్రారంభించిన అతడు.. కేవలం ఐదేళ్లలో తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.

Read Also : Viral Video : రైల్వే ట్రాక్‌పై గొడుగుతో నిద్రిస్తున్న వ్యక్తి.. రైలును నిలిపేసిన లోకో పైలట్.. వీడియో వైరల్

బాడీబిల్డింగ్ కమ్యూనిటీలో ఒక సాధారణ పోటీదారుగా నిలిచి అనేక మెడల్స్ సాధించాడు. దక్షిణ బ్రెజిలియన్ శాంటా కాటరినాలో జరిగిన ప్రాంతీయ పోటీలలో 4వ, 6వ స్థానాల్లో నిలిచాడు. 2023లో (U23) పోటీలో గెలుపొందాడు. దాంతో తన స్వగ్రామంలో అందరూ పావ్లక్‌ను “మిస్టర్ బ్లూమెనౌ” అని ముద్దుగా పిలిచేవారు.

ఆరోగ్య సమస్యల కారణంగానే పావ్లాక్ అకాల మరణం చెందాడని, అనాబాలిక్ స్టెరాయిడ్స్ అధిక మోతాదులో వాడటమే అతడి మృతికి కారణమని అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శకులు సైతం అతి చిన్న వయస్సులో ఆకట్టుకునే శరీరాకృతిని మార్చుకోవడం చాలా కష్టతరమైన పనిగా అభివర్ణించారు.

మితిమీరిన మందుల వాడకం అతని గుండెపోటుకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. పావ్లాక్‌కి సన్నితుడు ఒకరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. స్నేహితుడు పావ్లక్ మృతిపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. స్థూలకాయాన్ని అధిగమించేందుకు పావ్లక్ గతంలో ఎలా బాడీబిల్డర్ స్థాయికి ఎదిగాడు అనేదానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

పావ్లాక్ మాజీ ట్రైనర్ లూకాస్ చేగట్టి సైతం తన మిత్రుడిని కోల్పోయినందుకు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. “ఈ రోజు ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోవడం ఎంతో విచారకరమైన రోజు. చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టాడు. 2022లో పావ్లాక్‌ కలిశాడు. అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఎంతో గౌరవప్రదమైన అథ్లెట్ ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

 

View this post on Instagram

 

A post shared by Lucas Chegatti (@chegatti_treinador)

ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను మాథ్యూస్‌కి మొదటి కోచ్‌. అతన్ని ఒక స్నేహితుడిలా చూసుకునే అవకాశం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. గతంలో ఒకరితో ఒకరు పోటీ పడగా అతడే గెలిచాడు’’ అని చేగట్టి చెప్పుకొచ్చాడు. గత ఏప్రిల్‌లో, బ్రెజిలియన్ బాడీబిల్డర్ ఫిట్‌నెస్ బోధకుడు జోనాస్ ఫిల్హో కోవిడ్‌తో 29 ఏళ్లకే మరణించాడు. గత మేలో మేజర్‌కాన్ బాడీబిల్డర్ క్యాన్సర్ సర్వైవర్ 50 ఏళ్ల వయస్సులో మరణించాడు.

Read Also : Viral Video : బిలియనీర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అభిమాని కోసం లక్షల ఖరీదైన వాచ్.. వీడియో!