Viral Video : రైల్వే ట్రాక్‌పై గొడుగుతో నిద్రిస్తున్న వ్యక్తి.. రైలును నిలిపేసిన లోకో పైలట్.. వీడియో వైరల్
Sleeping On Railway Track : లోకో పైలట్ చూసాడు కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణాలు పోయేవి కదా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Loco Pilot Halts Train For Man Sleeping On Railway Track In Prayagraj
Sleeping On Railway Track : నిద్ర పోయేందుకు ఇతగాడికి ఎక్కడ జాగా దొరకలేదేమో.. ఏకంగా రైల్వే ట్రాక్‌పై తలపెట్టి మరి హాయిగా నిద్రపోతున్నాడు. పైగా ఎండ తగలకుండా గొడుగు కూడా అడ్డుపెట్టుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్‌రాజ్ సిటీలో రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకుంది. నిద్ర వస్తే ఎవరైనా ఓ చెట్టు కింద లేదా ఏదైనా భవన కింద నిద్రపోతారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం నిద్రపోయేందుకు రైల్వేట్రాక్ ఎంచుకున్నాడు.
Read Also : Viral Video : ఆపిల్ ఐఫోన్ కోసం కొడుకు నిరాహారదీక్ష.. కండిషన్ పెట్టి కొనిచ్చిన పూలు అమ్మే తల్లి..!
గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తికి రైలు వస్తుందనే విషయం కూడా తెలియలేదు. రైలు కిలోమీటర్ దూరంలో ఉండగానే లోకో పైలట్ గమనించి హార్న్ కొట్టినా కూడా అతడు లేవలేదు. చివరికి లోకో పైలట్ రైలు నిలిపివేసి దగ్గరికి వచ్చినా అలానే నిద్రపోతూ కనిపించాడు. ఏదోలా అతడిని నిద్రలేపగా ఏమి తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో లోకో పైలట్ రైలును ఆపిన తర్వాత ట్రాక్‌పై నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు వెళుతున్నట్లు చూడవచ్చు. రైల్వే ట్రాక్‌ను క్లియర్ చేయమని ఆ వ్యక్తిని లోకో పైలట్ కోరాడు. చూస్తుంటే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్టుగా కనిపించలేదు. ఇప్పుడేమి రైలు వచ్చేలా లేదులేన్నట్టుగా కాసేపు ట్రాక్‌పై కునుకు తీద్దామనినుకున్నాడేమో ఇలా కనిపించాడు.
ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 7.8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడికి మతిభ్రమించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అందుకే రైల్వేట్రాక్‌పై ఇలా నిద్రిస్తున్నాడని కామెంట్ చేశారు. మరొకరు ఈ విషయంపై లోతుగా విచారణ జరిపి సరైన రైల్వే భద్రతా నిబంధనలను అమలు చేయాలని కోరారు. లోకో పైలట్ చూసాడు కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణాలు పోయేవి కదా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
A person was sleeping on the railway track with an umbrella. Seeing this, the loco pilot stopped the train, Then he woke him up and removed him from the track. Then the train moved forward in Prayagraj UP
pic.twitter.com/OKzOpHJeih— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2024
ఈ ఏడాదిలో భారత్ అంతటా అనేక రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఈ నెలలో కాన్పూర్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో ముఖ్యమైన కేసులో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భారతీయ రైల్వేలు, ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించే విధంగా ప్రచారం కోసం వివిధ రకాల వస్తువులను రైల్వే ట్రాక్‌లపై ఉంచినందుకు యూట్యూబర్‌ను అరెస్టు చేసింది. నిందితుడు గుల్జార్ షేక్‌ను యూపీలోని ఖండ్రౌలీ గ్రామంలో అరెస్టు చేశారు. రైల్వే భద్రతకు విఘాతం కలిగించే చర్యలను పాల్పడవద్దని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆర్పీఎఫ్ విజ్ఞప్తి చేసింది.
Read Also : Viral Video : ఈమె గుండె గట్టిదే.. చెరువులో భారీ మొసలికి ఎలా ఆహారం తినిపిస్తుందో చూడండి..!