Brazil : మద్యం తాగుతు కూర్చున్న తండ్రి, విమానం నడిపిన 11 ఏళ్ల కొడుకు .. ప్రమాదంలో ఇద్దరు మృతి
తండ్రి నిర్లక్ష్యానికి కుటుంబమే బలైపోయింది. తాను బీరు తాగుతు కూర్చుని 11 ఏళ్ల కొడుకుతో విమానం నడిపించి ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి మరణ వార్త విన్న బాలుడి తల్లి కూడా..

Man Drinking Beer While Son Flies
Brazil Man Drinking Beer While Elevan Year Old Son Flies : 11 ఏళ్ల కొడుకుతో తండ్రి తన సొంత విమానంలో బయలుదేశాడు. దార్లో విమానంలో ఇంధనం నింపు కోవటానికి ఓ ఎయిర్ పోర్టులో దిగారు..తిరిగి టేకాఫ్ తీసుకున్నారు.టేకాఫ్ తీసుకున్న కొంతసేపటికే విమానం కూలిపోయిన ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన వింటే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదం జరగటానికి కారణం ఆ తండ్రి నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఎందుకంటే విమానం తాను నడపకుండా తన 11 ఏళ్ల కొడుకుతో నడిపించాడు.తాను మాత్రం పక్కనే తాపీగా కూర్చుని బీర్ తాగుతు 11 ఏళ్ల కొడుకు విమానం ఎలా నడపాలో చెబుతు డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే విమానం కూలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్ (Brazil)లో జరిగిన ఈ విమానం ప్రమాదం ఘటన సదరు తండ్రి నిర్లక్ష్యం వల్లే జరిగినట్లుగా తెలుస్తోంది. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా తండ్రి పక్క సీట్లో బీర్ తాగినట్టు కనిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా..జులై 29(2023)న గారాన్ మాయా (Garon Maia)అనే వ్యక్తి తన 11ఏళ్ల కుమారుడు ఫ్రాసిస్కో మాయా(Francisco Maia)తో కలిసి ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బేరాన్ 58 విమానంలో బయలుదేరాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానం అడవిలో కూలిపోయింది. ఈ ప్రమాదంపై స్థానిక మీడియా చెబుతున్న కథనాల ప్రకారంగా చూస్తే ఆ తండ్రీకొడుకులు తమ సొంత విమానంలో రాండోనియా నగరం నుంచి బయలుదేరారు. మధ్యలో విమానానికి ఇంధన ఫిల్ చేసుకునేందుకు విల్హేనా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఆ తరువాత తిరిగి విమానం టేకాఫ్ తీసుకున్న వారిద్దరు క్యాంపో గ్రాండేలో ఉంటున్న ఫ్రాసిస్కో తల్లి వద్ద ట్రాప్ చేసేందుకు వస్తుండగా విమనాం ప్రమాదం జరిగింది.
విమానాన్ని గారాన్ నడపకుండా తన 11 ఏళ్ల కొడుకుకు డైరెక్షన్స్ ఇస్తు నడిపించటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కుమారుడికి విమానం ఎలా నడపాలో చెపుతుండటం స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది. కాగా..నిబంధనల ప్రకారం పిల్లలు విమానం నడపాలంటే 18 ఏళ్లు నిండాలి. కానీ గారాన్ మాత్రం ఏదో బైక్ నడపటం నేర్పినట్లుగా 11 ఏళ్ల కొడుకుతో విమానం నడపించటం వల్లే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Manmadh Rebba : అమెరికా లో మెరిసిన తెలుగు తేజం ‘మన్మధ్ రెబ్బా’.. 386 కిలోమీటర్లు పరిగెత్తి..
ఇకపోతే భర్తను, కొడుకును ఒకేసారి కోల్పోయిన ఆమె దు:ఖం అంతా ఇంతా కాదు. కాసేపట్లో తన భర్త కొడుకు వస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆమెకు భర్త నిర్లక్ష్యం వల్ల ఇద్దరిని కోల్పోయింది.ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే (ఆగస్టు 1) ఆత్మహత్య చేసుకోవటం మర్చిపోలేని విషాదమనే చెప్పాలి. అలా గారాన్ నిర్లక్ష్యానికి కుటుంబం అంతా బలైపోయింది.
Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup
— D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023