Italy Government : రాత్రి వేళల్లో ఫుల్‌గా మద్యం సేవిస్తే.. క్యాబ్‌లో ఉచితంగా ఇంటికి.. సరికొత్త పథకం ..

మందు బాబులు క్లబ్ నుంచి బయటకు రాగానే ఎంత మద్యం సేవించారని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో మోతాదుకు మించి మద్యం సేవించారని తేలితే వారిని క్యాబ్ లో ఎక్కించుకొని నేరుగా వారింటి వద్దకు తీసుకెళ్లి దింపేస్తారు.

Italy Government : రాత్రి వేళల్లో ఫుల్‌గా మద్యం సేవిస్తే.. క్యాబ్‌లో ఉచితంగా ఇంటికి.. సరికొత్త పథకం ..

Italian Government

Italy Government Free taxi: రాత్రి వేళల్లో పొద్దుపోయే వరకు క్లబ్‌లలో మద్యం సేవించి.. మద్యం మత్తులో రోడ్లపైకొచ్చి అనేక మంది ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ఇటలీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మందు బాబులకు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో పాటు, వారి ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాత్రిపూట నైట్ క్లబ్బుల్లో ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులను ట్యాక్సీల్లో ఉచితంగా ఇంటిదగ్గర దించుతారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ఆరు నైట్ క్లబ్బుల వద్ద అర్థరాత్రి దాటి తరువాత కూడా మందు బాబులకోసం క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

Bill Gates: నా తండ్రి మరణంతో నిద్ర విలువ తెలిసొచ్చింది.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో చెప్పిన బిల్ గేట్స్

మందు బాబులు క్లబ్ నుంచి బయటకు రాగానే ఎంత మద్యం సేవించారని పరీక్షి చేస్తారు. ఆ పరీక్షలో మోతాదుకు మించి మద్యం సేవించారని తేలితే వారిని క్యాబ్ లో ఎక్కించుకొని నేరుగా వారింటి వద్దకు తీసుకెళ్లి దింపేస్తారు. ఇందుకోసం మందు బాబులు ఎలాంటి రుసుము క్యాబ్ డ్రైవర్ కు ఇవ్వాల్సిన పనిలేదు. ఆ రవాణా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. అయితే, ఈ పథకాన్ని ఇటలీ ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రయోగాత్మక పథకం మంచి ఫలితాలను ఇస్తే దేశవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామని ఆ దేశ రవాణా శాఖ మంత్రి మాటియో సాల్విని చెప్పారు.

Pakistan : జాతీయ అసెంబ్లీని రద్దు చేయండి.. పాక్ ప్రధాని లేఖ

ప్రయోగాత్మకంగా ఇటలీ అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకం మంచి ఆదరణ పొందుతుందని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.. మద్యం మత్తులో వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది మంచి ఆలోచన అని స్థానిక ప్రజలు భావిస్తున్నారట. ఈ పథకం గురించి తెలుసుకున్న భారతీయులు.. ఇలాంటి పథకం భారతదేశంలోని ప్రధాన నగరాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండటం గమనార్హం.