Bill Gates: నా తండ్రి మరణంతో నిద్ర విలువ తెలిసొచ్చింది.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో చెప్పిన బిల్ గేట్స్

బయట కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని బిల్ గేట్స్ ఈ సందర్భంగా సూచించారు. యుక్తవయస్సు నుంచి కూడా మంచి నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.

Bill Gates: నా తండ్రి మరణంతో నిద్ర విలువ తెలిసొచ్చింది.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో చెప్పిన బిల్ గేట్స్

Bill Gates

Updated On : August 9, 2023 / 9:01 AM IST

Bill Gates: నిత్యం ఏదోఒక పనిచేస్తూ బిజీబిజీగా గడుపుతూ కొందరు, పని ఒత్తిడిలో మరికొందరు నిద్రకు ప్రాధాన్యతను ఇవ్వరు. మూడు లేదా నాలుగు గంటలు నిద్రపోతే చాలని భావిస్తుంటారు. అలాచేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలని వైద్యులు చెబుతుంటారు. తాజాగా నిద్ర గురించి మైక్రో‌సాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు. బిల్ గేట్స్ మైక్రోసాప్ట్‌ను నెలకొల్పినప్పుడు నిద్రపోవడం సోమరితనంగా, నిద్ర అనవసరమైనదిగా భావించేవారట. కానీ, నిద్ర సోమరితనం కాదని, నిద్ర అవసరమని తండ్రి మరణం తరువాత బిల్ గేట్స్‌కు బోధపడిదంట. ఈ విషయాలను ఓ కార్యక్రమంలో బిల్ గేట్స్ స్వయంగా వెల్లడించారు.

Bill Gates : తాత అయిన బిల్ గేట్స్ .. చిన్నారికి స్వాగతం పలికిన గేట్స్, మెలిండా

నేను 30ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు నిద్ర పోవటానికి ప్రాధాన్యత ఇచ్చేవాడినికాదు. నిద్ర అనేది సోమరితనం, అవసరం లేనిది అనే భావనలో ఉండేవాడిని. ఆ సమయంలో నిద్ర గురించి అనేక సంభాషణలు వచ్చేవి. నేను ఆరు గంటలు నిద్రపోయానని ఒకరు చెబితే, లేదు నేను ఐదు గంటలే నిద్రపోయానని మరొకరు.. కొన్నిసార్లు అసలు నిద్రపోనని మరొకరు అనేవారు. వారి మాటలు విన్నతరువాత ఎంత గొప్ప పనిచేస్తున్నారనిపించింది. నేను కూడా నిద్రపోకుండా ఉండటానికే ఎక్కువ ప్రయత్నించేవాడిని అంటూ బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. అయితే, 2020లో తన తండ్రి మరణంతో నిద్రపై తన అభిప్రాయం మారిందని చెప్పారు. తన తండ్రి అల్జీమర్స్ తో చనిపోవడమే అందుకు కారణమని అన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు.

Sleepless Nights : మనం చేసే రోజువారి తప్పులే నిద్రలేని రాత్రులు గడపటానికి కారణమా ?

రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోతున్నానా? ఎంత సుఖంగా నిద్రపోతున్నా? అని లెక్కలు వేసుకుంటున్నట్లు బిల్ గేట్స్ వివరించారు. బయట కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని బిల్ గేట్స్ ఈ సందర్భంగా సూచించారు. యుక్తవయస్సు నుంచి కూడా తగినంత మంచి నిద్రపోవడం చాలా ముఖ్యమని బిల్ గేట్స్ చెప్పారు.