Bill Gates : తాత అయిన బిల్ గేట్స్ .. చిన్నారికి స్వాగతం పలికిన గేట్స్, మెలిండా

మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవ‌స్థాప‌కుడు 67 ఏళ్ల బిల్‌గేట్స్ తాత అయ్యారు. గేట్స్ కుమార్తె జెన్నిఫర్‌ గేట్స్‌, న‌యెల్ నాజ‌ర్‌ దంపతులు మొదటిసారిగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

Bill Gates : తాత అయిన బిల్ గేట్స్ .. చిన్నారికి స్వాగతం పలికిన గేట్స్, మెలిండా

Bill Gates and Ex Wife Melinda Welcome Grandchild

Updated On : March 6, 2023 / 11:27 AM IST

Bill Gates : మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవ‌స్థాప‌కుడు 67 ఏళ్ల బిల్‌గేట్స్ (Bill Gates) తాత అయ్యారు. గేట్స్ కుమార్తె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిల్స్ గేట్స్ తాత అయ్యారు. గేట్స్ కుమార్తె జెన్నిఫర్‌ గేట్స్‌ (Jennifer Gates) న‌యెల్ నాజ‌ర్‌ (Nayel Nassar) దంపతులు మొదటిసారిగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను జెన్నిఫర్‌ గేట్స్‌ (Jennifer Gates) సోషల్‌ మీడియా వేదికగా చిన్నారి చిట్టిపాదలను దంపతులు ఇద్దరు తమ చేతుల్లో పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభినందనలు చెబుతున్నారు నెటిజన్లు.

బిల్‌ గేట్స్‌ (Bill Gates), మెలిందా గేట్స్‌ (Melinda Gates) తల్లిదండ్రులైన తమ కుమార్తె, అల్లుడికి సోషల్‌ మీడియా ద్వారా కంక్రాట్స్‌ చెప్పారు. గర్వపడుతున్నాం అంటూ తెలిపారు. మెలిండా తన మనుమరాలికి స్వాగతం పలుకుతూ..ప్రపంచంలోకి అడుగుపెట్టిన బుజ్జాయికి స్వాగతం అంటూ నా గుండె ఆనందంతో పొంగిపోతుంది అంటూ పేర్కొన్నారు.

బిల్ గేట్స్ దంపతులు పెద్ద కుమార్తె జెన్నిఫర్ ‌(Jennifer Gates) -నయెల్‌ (Nayel Nassar) 2021 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2022 నవంబర్‌లో తాను ప్రెగ్నెంట్‌ అంటూ జెన్నిఫర్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. బేబీ బంప్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె పండంటి బిడ్డకు తల్లి అయిన విషయాన్ని కూడా ప్రకటించింది. బిడ్డ మొహం కనిపించకుండా చిట్టిపాదాలు కనిపించేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

కాగా కూతురు తల్లిని కాబోతున్నానని తెలిపాక గేట్స్ కూడా “నేను వచ్చే ఏడాది తాత అవుతాను” అంటూ ఓ బ్లాగ్ లో పేర్కొన్నారు. తాతను అవుతున్నాననే ఆ అనుభూతి నన్ను భావోద్వేగానికి గురి చేస్తుంది అని పేర్కొన్నారు. కాగా..పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత గేట్స్ దంపతులు  విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినా వారి బిడ్డ తల్లి కావటంతో తాము గ్రాండ్ పేరెంట్స్ కావటంతో ఇద్దరు చిన్నారి రాకకు సంతోషాన్ని వ్యక్తంచేశారు.