viral pic:కరోనా టీకా తీసుకోనందుకు..రోడ్డుపై నిలబడి పిజ్జా తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు..

బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సనారో రోడ్డు పక్కన నిలబడి పిజ్జా తిన్నారు. దీనికి కారణం ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవటమే.

Brazil President Jair Bolsanaro eats pizza on side walk కరోనా నియంత్రకు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. వారు వేయించుకుని మీరు కూడా టీకా వేయించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో. నాకు కరోనా వచ్చింది తగ్గింది. కానీ నేను మాత్రం వ్యాక్సిన్ వేయించుకోబోను అని ఇప్పటికి చెబుతున్నారు.

ఈక్రమంలో వ్యాక్సిన్ వేయించుకోనందుకు ఆయనకు యూఎన్ సమావేశంలో కాస్తంత వివక్ష ఎదురైంది. దీంట్లో భాగంగానే న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ సమావేశానికి వచ్చిన జైర్ బోల్సనోరా రోడ్డు పక్కనే నిలబడి పిజ్జా తినాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమావేశానికి వచ్చినవారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ నేను మాత్రం వేయించుకోలేదు..వేయించుకోను అని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు జైర్ బోల్సనోరా.

Read more : తొలి సారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

కాగా.. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సమావేశానికి వచ్చే వివిధ దేశాల ప్రతినిధులు కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని న్యూయార్క్ మేయర్ స్పష్టంగా చెప్పేశారు. ఈ మాటల్ని కూడా బోల్సనారో లెక్కచేయలేదు. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 19,2021) రాత్రి భోజనం చేసేందుకు బోల్సనారో బృందం రెస్టారెంటుకు వెళ్లింది.

కానీ న్యూయార్క్ కరోనా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని వారిని రెస్టారెంట్లలోకి అనుమతించడం జరగదు.అందుకే బోల్సనారో బృందాన్ని రెస్టారెంట్లోకి రానివ్వలేదు రెస్టారెంట్ నిర్వాహకులు. దీంతో జైర్ తన బృందంతో కలిసి రోడ్డుపక్కనే నిలబడి పిజ్జా తిన్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరలయ్యాయి. అదన్నమాట కరోనా వ్యాక్సిన్ వేయించుకోనందుకు ఓ దేశాధ్యక్షుడికి జరిగిన పరిస్థితి.

Read more : Vaccination Effects: కరోనా వ్యాక్సిన్ తో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా?!..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

కాగా..జైర్ బోల్సనారో మొదటి నుంచి కరోనాపై నిర్లక్ష్య ధోరణి చూపుతు వస్తున్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. పైగా కరోనాను చూసి భయపడాల్సిన అవసరం లేదని..తాను వ్యాక్సిన్ తీసుకోబోనని ప్రకటించారు.కాగా బ్రెజిల్ లో 2.12 కోట్ల కరోనా కేసులున్నాయి. ఇప్పటికే కరోనా సోకి 5.91లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు