తొలి సారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

తొలి సారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో జాతీయవ్యాప్తంగా జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కొవాక్సిన్ ను ఆయన వేయించుకున్నట్లు సమాచారం.

సోమవారం మార్చి 1నుంచి కరోనా సెకండ్ ఫేజ్ డోసేజ్ లో భాగంగా 60ఏళ్లు పైబడ్డ వారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తున్న కొవిడ్ 19పై పోరాడేందుకు మన డాక్టర్లు, సైంటిస్టులు గుర్తించదగ్గ స్థాయిలో కృషి చేశారని అన్నారు.

అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పీఎం మోడీ సూచించారు. మనమంతా కలిసి కొవిడ్ రహిత దేశంగా ఇండియాను మార్చేద్దాం. అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు కూడా చేశారు.

‘ఎయిమ్స్ వేదికగా కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నా. ప్రపంచాన్నే వణికిస్తోన్న మహమ్మారిపై పోరాడేందుకు డాక్టర్లు, సైంటిస్టులు గుర్తించదగ్గ సేవలు అందించారు. అర్హత కలిగిన వారంతా వ్యాక్సిన్ తీసుకోండి. ఇండియాను కొవిడ్ రహితంగా మార్చేయండి’ అంటున్నారు.