Britain’s next PM: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని రేసులో వారిద్దరు ..

తాజా పరిణామాల నేపథ్యంలో రిషి సునాక్ మళ్లీ ప్రధాని రేసులోకి వచ్చారు. అయితే రిషి సునాక్ కు పోటీగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ పేరు వినిపిస్తోంది. ప్రధాని స్థానాన్ని భర్తీ చేయాలనుకునేవారు పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ చట్ట సభ్యుల నుంచి కనీసం 100 ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది.

Britain’s next PM: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని రేసులో వారిద్దరు ..

Britan Next PM

Updated On : October 21, 2022 / 11:28 PM IST

Britain’s next PM: లిజ్‌ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను వెనక్కి నెట్టేసి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన లిజ్ ట్రస్ 45 రోజులకే పీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ దేశంలో రాజకీయం మళ్లీ మొదటికొచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో రిషి సునాక్ మళ్లీ ప్రధాని రేసులోకి వచ్చారు. అయితే రిషి సునాక్ కు పోటీగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ పేరు వినిపిస్తోంది. ప్రధాని స్థానాన్ని భర్తీ చేయాలనుకునేవారు పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ చట్ట సభ్యుల నుంచి కనీసం 100 ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. అందుకోసం అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

Liz Truss: లిజ్ ట్రస్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే పెరిగిన బ్రిటన్ కరెన్సీ విలువ

ప్రస్తుతం బ్రిటన్ లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే మరోవారం సమయం పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నది ఎవరనేది సోమవారం, శుక్రవారం ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి బోరిస్ జాన్సర్ సీఓపీ26 అధ్యక్షుడు అలోక్ శర్మ మద్దతును మాజీ పీఎం బోరిస్ జాన్సన్ పొందాడు. దీంతో నలుగురు మంత్రుల మద్దతు పొందినట్లయింది. అంతకుముందు బెన్ వాలెస్, జాకబ్ రీస్-మోగ్, సైమన్ క్లార్క్ తమ మద్దతును జాన్సన్ కు ప్రకటించారు. అయితే అదే స్థాయిలో జాన్సన్ ప్రధాని అభ్వర్ధిత్వానికి వ్యతిరేక వ్యక్తమవుతుంది.

UK PM Liz Truss Resigns : బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. పదవి చేపట్టిన 45 రోజుల్లోనే

యూకే నాయకత్వ రేసులో ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ రిషి సునక్‌కు తన మద్దతును ప్రకటించారు. సునక్ తాను రేసులో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించనప్పటికీ, యూకేకి ఆర్థిక స్థిరత్వం, బలమైన నాయకత్వం అవసరమని జావిద్ పేర్కొన్నాడు. ప్రధానమంత్రి కావడానికి సునక్ సరైన ఎంపిక అని తాను నమ్ముతున్నానని పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ లో ఆర్థిక సంక్షోభం కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేయక తప్పలేదు. బ్రిటీష్ చరిత్రలో ఇది నిలిచిపోయే ఘట్టం. ఇప్పటివరకు, దేశంలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ పేరు నిలుస్తుంది. ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన 45వ రోజున ఆమె రాజీనామా చేశారు.