Liz Truss: లిజ్ ట్రస్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే పెరిగిన బ్రిటన్ కరెన్సీ విలువ

ఆ వైపుగా చేసిన ప్రయత్నాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ సైతం ఇదే కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన.. దేశంలో ఆర్థిక సంస్కరణల పట్ల అనేక హామీలు ఇచ్చారు. అయితే అవి వాస్తవ రూపం దాల్చకపోవడంతో బోరిస్ రాజీనామా చేశారు.

Liz Truss: లిజ్ ట్రస్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే పెరిగిన బ్రిటన్ కరెన్సీ విలువ

UK Pound Gains As Liz Truss Quits As PM

Liz Truss: బ్రిటన్ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ రాజీనామా చేయగానే ఆ దేశ కరెన్సీ స్వల్వంగా లాభపడింది. గురువారం సాయంత్రం ఆమె తన రాజీనామాను ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది సమయానికే 0.36 శాతం పౌండ్ విలువ పెరగడం గమనార్హం. గత నెలలో ఆమె ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అందులో భారతీ పన్నులు తగ్గించారు. దీంతో రుణాల భారం పెరగడంతో పౌండ్ విలువ తగ్గుతూ వచ్చింది. ఇక ప్రధానిగా ట్రజ్ రాజీనామాతో రుణ భారాలు తగ్గుతాయనే నమ్మకం ఏర్పడింది. దీంతో పౌండ్ విలువ స్వల్పంగా పెరిగింది.

వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువస్తానని చెప్పిన ప్రధాని లిజ్.. ఆ వైపుగా చేసిన ప్రయత్నాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ సైతం ఇదే కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన.. దేశంలో ఆర్థిక సంస్కరణల పట్ల అనేక హామీలు ఇచ్చారు. అయితే అవి వాస్తవ రూపం దాల్చకపోవడంతో బోరిస్ రాజీనామా చేశారు.

కాగా, బోరిస్ జాన్సన్ స్థానంలో లిజ్ ట్రస్ ప్రధాని పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. బాధ్యతలు తీసుకున్న 45 రోజులకే రాజీనామా చేయడం గమనార్హం. దీంతో బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జార్జ్ కానింగ్‌ క్షయ వ్యాధి బారినపడి తీవ్రం కావడంతో ఆయన మరణించారు.

పార్టీ గేట్ కుంభకోణం కారణంగా ప్రధాని పదవిని బోరిస్ జాన్సన్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పదవికి ఎన్నికలు జరిగాయి. భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ట్రస్‌కే పట్టంకట్టడంతో ఆమె సునాయసంగా విజయం సాధించారు. సెప్టెంబర్ 5న ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనేక సవాళ్లు, యూకే ప్రజల అచంచల విశ్వాసం మధ్య యూకే ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌లో ట్రస్ వచ్చాక పరిస్థితి మారుతుందని అంతా భావించారు. ట్రస్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే, లిజ్ ట్రస్ తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

Protest against Jinping: జిన్‭పింగ్‭పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. రహస్యంగా టాయిలెట్ల ద్వారా నిరసన