Protest against Jinping: జిన్‭పింగ్‭పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. రహస్యంగా టాయిలెట్ల ద్వారా నిరసన

అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్‭పింగ్‭కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అంటూ ఆ బ్యానర్లలో రాసుకొచ్చారు. తమకు స్వేచ్ఛ కావాలని, పౌరులుగా జీవించాలని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చైనీయుల్లో ప్రజాస్వామ్య కాంక్ష పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.

Protest against Jinping: జిన్‭పింగ్‭పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. రహస్యంగా టాయిలెట్ల ద్వారా నిరసన

Protest against China's Xi Jinping spreads after 'no to great leader' poster in Beijing

Protest against Jinping: చైనాకు సంబంధించి ఎప్పుడూ వింతలు, విశేషాలు, అద్భుతాలు లాంటి వార్తలే తరుచూ వింటుంటాం. కానీ ప్రజలు, హక్కులు, నిరసనలు లాంటివి మచ్చుకైనా కనిపించవు. కారణం.. అక్కడి ప్రభుత్వం, ప్రభుత్వ విధానం. ఎన్నికలు లేని ప్రజాస్వామ్యం లేని దేశం. దేశంలో ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం ఉంటుంది. దేశాధినేతను కూడా ప్రజలు కాకుండా పార్టీయే ఎన్నుకుంటుంది. అందుకే ఆ దేశంలో ప్రభుత్వ వ్యతిరేకతలు, నిరసనలు లాంటివి కనిపించవు. పైగా ప్రజా మీడియా ఉండదు. ప్రభుత్వం నుంచి అనేక ఆంక్షలు. ప్రభుత్వం ఏదైతే చెప్పాలనుకుందో అది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. అంతే కానీ, చైనీయుల మనోభావాలు, అభిప్రాయాలు, కష్టాలు ప్రజలకు కనిపించవు.

ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్‭పింగ్‭కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అంటూ ఆ బ్యానర్లలో రాసుకొచ్చారు. తమకు స్వేచ్ఛ కావాలని, పౌరులుగా జీవించాలని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చైనీయుల్లో ప్రజాస్వామ్య కాంక్ష పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.

Amit Malviya: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేత ఆరోపణలు

తాజాగా ఈ నిరసనను చైనీయులు మరింత విస్తృతం చేస్తున్నారు. చైనాలో ఉన్న నిర్బంధం, నియంతృత్వం దృష్ట్యా టాయిలెట్ల ద్వారా నిరసన చేస్తున్నారు. బైబై జిన్‭పింగ్‭ అంటూ పోస్టర్లు అతికిస్తున్నారు. బీజింగ్‌లోని చైనా ఫిలిం ఆర్కైవ్ ఆర్ట్ సినిమాలో ఉన్న బాత్రూమ్‌లో ‘‘నియంతృత్వాలను తిరస్కరించండి’’ అనే నినాదాన్ని రాశారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ తదితర దేశాల్లోని సుమారు 200 విశ్వవిద్యాలయాల్లో కూడా జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. మైనేలోని ఓ కళాశాలలో చేతిరాతతో ఓ నినాదం కనిపించింది. బీజింగ్‌లోని ఓ వంతెనపై ఏర్పాటు చేసిన మొదటి బ్యానర్‌ను ఈ నినాదంలో ప్రశంసించారు. తాము చైనా ప్రజలమని, తమ మనసులోని మాటను వెల్లడిస్తున్న ఈ సందేశాన్ని వ్యాపింపజేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.

చైనాలో జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడపక తప్పదు. బీజింగ్‌లోని ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన బ్యానర్‌కు సంబంధించిన కీ వర్డ్స్‌ను చైనా ఇంటర్నెట్‌లో కట్టడి చేశారు. బీజింగ్ ప్రొటెస్టర్, సైటోంగ్ బ్రిడ్జ్ వంటి పదాలతో ఇంటర్నెట్‌లో వెతికినా ఈ బ్యానర్లు కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో బ్రిడ్జ్, కరేజ్, హీరో వంటి పదాలను కూడా కట్టడి చేశారు. ఆ బ్యానర్లో ‘‘కోవిడ్ పరీక్ష వద్దు, ఆహారం కావాలి. అష్టదిగ్బంధనం వద్దు, స్వేచ్ఛ కావాలి. అబద్ధాలు వద్దు, గౌరవ-మర్యాదలు కావాలి. సాంస్కృతిక విప్లవం వద్దు, సంస్కరణలు కావాలి. మహా నేత అక్కర్లేదు, ఎన్నికలు జరగాలి. బానిసగా ఉండకండి, పౌరునిగా జీవించండి’’ అని రాసుకొచ్చారు. మరొక బ్యానర్లో ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అని రాసుకొచ్చారు.

Maharashtra: విందులో ఒక్కటైన పవార్, షిండే, ఫడ్నవీస్.. మహా రాజకీయాల్లో కలకలం