Maharashtra: విందులో ఒక్కటైన పవార్, షిండే, ఫడ్నవీస్.. మహా రాజకీయాల్లో కలకలం

2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసేనతో ఎన్సీపీ చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

Maharashtra: విందులో ఒక్కటైన పవార్, షిండే, ఫడ్నవీస్.. మహా రాజకీయాల్లో కలకలం

Sharad Pawar attends dinner with Shinde, Fadnavis

Maharashtra: మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిన అనంతరం నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతి అంశమూ, ప్రతి కదలిక రాజకీయ కాకను రేపుతోంది. ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఏ నేత కాస్త భిన్నంగా మాట్లాడినా ఏదో జరగబోతోందంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం ప్రత్యేక విందు సమావేశంలో పాల్గొనడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ విషయమై సీఎం షిండే స్పందిస్తూ.. ఈ సమావేశానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, తామంతా క్రీడల అభిమానులమని, అందుకే కలిశామని వివరణ ఇచ్చారు.

2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసేనతో ఎన్సీపీ చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో పవార్ ఎప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదంటూ రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు. ఈ తరుణంలోనే ఆయన ఫడ్నవీస్, షిండేలను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇక తాజా విషయానికి వస్తే.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో పవార్, షిండే, ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ముగ్గురు నేతలు సరదాగా కలిసి విందులో పాల్గొనడంతో రాజకీయాల్లో ఇంకేవో పరిణామాలు జరగబోతున్నట్లు చర్చ లేసింది. అయితే దీనికి సీఎం షిండే క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఆ విశ్లేషణలు మాత్రం ఆగడం లేదు.

Mission LiFE: పర్యావరణ సమస్యతో పోరాడాలంటే ఆ ఒక్కటి చాలా ముఖ్యం.. ప్రధాని మోదీ

ఇక సీఎం షిండే ట్వీట్ కూడా ఈ విశ్లేషణలకు కొంత ఊతం ఇస్తోంది. బుధవారం తన ట్వీట్‌లో.. ‘‘పవార్, ఫడ్నవీస్, షేలార్ ఒకే వేదికపైకి వచ్చారు. దీంతో కొందరికి నిద్ర పట్టకపోవచ్చు. అయితే ఇది రాజకీయాలకు సంబంధించిన వేదిక కాదు. మేమంతా క్రీడలను అభిమానించి, మద్దతిచ్చేవాళ్లం. అందుకే మేమంతా మా రాజకీయ విభేదాలకు అతీతంగా క్రీడల అభివృద్ధి కోసం కలిసి వచ్చాము’’ అని రాసుకొచ్చారు. షిండే చేసిన ఈ ట్వీట్ ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఉద్ధవ్ థాకరేతో ఎన్సీపీ రాజకీయంగా సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక శరద్ పవార్ కూడా స్పందిస్తూ ఈ సమావేశానికి, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. తాను బీసీసీఐ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నరేంద్ర మోదీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉండేవారని, ఆ సమయంలో బీసీసీఐ సమావేశాలకు మోదీ కూడా హాజరయ్యేవారని తెలిపారు. ప్రస్తుత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రస్తుత బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చేవారన్నారు. తమకు క్రీడల పట్ల ఒకే విధమైన ఆసక్తి ఉండటం వల్లే వారు వచ్చారన్నారు.

Amit Malviya: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేత ఆరోపణలు