Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం 36 గంటల పాటు ఊయలూగుతూ..
చిన్న పిల్లలు ఊయలు ఊగుతున్నప్పుడు చూస్తుంటాం కదా. సరదాగా అప్పుడప్పుడు చిన్నతనంలోకి వెళ్తూ.. ఊయల ఊగే పెద్దవాళ్లను చూస్తూనే ఉంటాం. కానీ, కొన్ని గంటల పాటు ఊయల ఊగేవాళ్ల గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

Guinnes World Record
Guinness World Record: చిన్న పిల్లలు ఊయలు ఊగుతున్నప్పుడు చూస్తుంటాం కదా. సరదాగా అప్పుడప్పుడు చిన్నతనంలోకి వెళ్తూ.. ఊయల ఊగే పెద్దవాళ్లను చూస్తూనే ఉంటాం. కానీ, కొన్ని గంటల పాటు ఊయల ఊగేవాళ్ల గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ స్కాట్ అనే 51ఏళ్ల వ్యక్తి 36గంటల పాటు ఊయల ఊగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశడు. లాచ్ లెవెన్స్ లార్డర్ క్రికెట్ పిచ్ లో శనివారం ఉదయం 6గంటలకు మొదలుపెట్టి ఆదివారం సాయంత్రం వరకూ ఊగుతూనే ఉన్నాడని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు.
ఈ అటెంప్ట్ లో స్కాట్ గంటకు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే బ్రేక్ తీసుకున్నాడు. అది కూడా ఉదయం 3గంటలకు మాత్రమే ఆగాడు. 2020లో క్విన్ లెవీ పేరిట ఉన్న 34గంటల రికార్డు బ్రేక్ చేశాడు.
Read Also: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్
“ఇది చాలా మంచి విషయం. నా కాళ్లు కొంచెం నొప్పిగా ఉన్నాయి. కానీ, నేను బాగానే ఉన్నా. ఇది చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇదొక ఛాలెంజింగ్ విషయమే. కానీ, బాగుంది. నేను బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నా” అని రికార్డ్ బ్రేక్ చేసిన అనంతరం వెల్లడించాడు.