4లక్షల 75వేల డాలర్లును తిరిగి ఇచ్చేసిన క్వాడెన్ తల్లి

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 06:57 AM IST
4లక్షల 75వేల డాలర్లును తిరిగి ఇచ్చేసిన క్వాడెన్ తల్లి

Updated On : February 28, 2020 / 6:57 AM IST

ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేస్ కు చెందిన 9ఏళ్ల క్వాడెన్ మరుగుజ్జుతనం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో అమెరికా కమెడియన్ బ్రాడ్ విలియమ్సన్ ని ‘గోఫండ్ మీ’ పేజీని ప్రారంభించటానికి ప్రేరేపించింది. ఆ పేజీ ద్వారా దాదాపు 4 లక్షల 75 వేల విరాళాలను సేకరించారు. అలా సేకరించిన డబ్బు మెుత్తాన్ని క్వాడెన్ తల్లికి పంపిస్తూ నిర్వాహకులు చిన్నారి డిస్నీ ల్యాండ్ ట్రిప్ కోసం సేకరించినట్లు చెప్పారు.

అసలు విషయం ఏమిటంటే…

క్వాడెన్ అచాడ్రోపాల్సియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తోటి విద్యార్ధులు మరుగుజ్జుగా ఉన్నావంటూ హేళన చేస్తూ మాట్లాడేవారు. ఆ మాట్లాలకు బాధపడుతు క్వాడెన్ ‘నేను చనిపోవాలనుకుంటున్నా, కత్తినో, త్రాడునో ఇవ్వమ్మ’ అంటూ తల్లితో విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోపై స్పందించిన సెలబ్రిటీలు క్వాడెన్ కు అండగా నిలిచారు. నెటిజన్లు క్వాడెన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అతని డిస్నీ ల్యాండ్ ట్రిప్ కోసమని పెద్ద మెుత్తంలో విరాళాలను ఇచ్చారు. క్వాడెన్ తల్లి మాత్రం అలా సేకరించి విరాళాలను క్వాడెన్ కోసం కాకుండా ఛార్టీ కోసం ఉపయోగించాలనుకున్నట్లు మీడియాకు చెప్పింది.

ఏ పిల్లాడైన డిస్నీ ల్యాండ్ వెళ్లాలని ఆశపడతాడు. క్వాడెన్ కూడా అంతే. కానీ క్వాడెన్ ని దూరంగా తీసుకువెళ్లి సంతోష పెట్టడం ఇష్టం లేదు. అందుకే ఎటువంటి పరిస్ధితులైన ఎదుర్కోనే విధంగా అతని తయారు చేయాలనుకుంటున్నాం. అలాంటి అవమానాలను తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం పనిచేస్తున్న సంస్ధలకు ఈ డబ్బును వినియోగించాలన్ని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.