Canada Wildfires Intensify:కెనడా అడవుల్లో మంటలు తీవ్రతరం

కెనడా దేశంలోని అడవుల్లో రాజుకున్న మంటలు తీవ్రతరమయ్యాయి. ఇప్పటికే కెనడాలో 17,800 చదరపు మైళ్ల విస్తీర్ణం కాలి బూడిదైంది. వాతావరణ మార్పులతో వేడెక్కుతుండటంతో అడవిలో మంటలు రాజుకుంటున్నాయి....

Canada Wildfires Intensify:కెనడా అడవుల్లో మంటలు తీవ్రతరం

Canada Wildfires Intensify

Updated On : June 11, 2023 / 5:44 AM IST

Canada Wildfires Intensify: కెనడా దేశంలోని అడవుల్లో రాజుకున్న మంటలు తీవ్రతరమయ్యాయి. ఇప్పటికే కెనడాలో 17,800 చదరపు మైళ్ల విస్తీర్ణం కాలి బూడిదైంది. వాతావరణ మార్పులతో వేడెక్కుతుండటంతో అడవిలో మంటలు రాజుకుంటున్నాయి. అడవిలో రాజుకున్న కార్చిచ్చుతో కెనడా పలు ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలను ఖాళీ చేశామని కెనడా మంత్రి చెప్పారు. ఈ మంటలు వేసవికాలం అంతా కొనసాగుతాయని(Could Last All Summer) మంత్రి హెచ్చరించారు.

Cyclone Biparjoy to intensify : పోర్‌బందర్ తీరాన్ని తాకనున్న బిపర్ జోయ్ తుపాన్

ముఖ్యంగా కెనడాలోని పశ్చిమ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. చాలా రోజుల విరామం తర్వాత అల్బెర్టాలో మంటలు తీవ్రమయ్యాయి. శుక్రవారం రాత్రి ఎడ్సన్ పట్టణ ప్రజలను తరలిస్తున్నారు. ప్రావిన్సులోని మధ్య, వాయువ్య ప్రాంతాల్లో పరిస్థితి కష్టంగా ఉందని పట్టణాలకు అగ్గి ముప్పు పొంచి ఉందని క్యూబెక్ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంకోయిస్ బొన్నార్డెల్ చెప్పారు.