Canadian Family: ముస్లిం ఫ్యామిలీని ట్రక్కుతో గుద్ది హతమార్చిన ట్రక్ డ్రైవర్
కెనడియన్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన నలుగురు వ్యక్తులను ట్రక్కుతో గుద్ది చంపేశాడో ట్రక్ డ్రైవర్. మతపరమైన ద్వేషంతో ఘటనకు పాల్పడి గుద్దిన వెంటనే దిగి పారిపోయాడని కెనడియన్ పోలీసులు చెప్తున్నారు.

Canadian Family Killed In Hit And Run Targeted For Being Muslim
Canadian Family: కెనడియన్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన నలుగురు వ్యక్తులను ట్రక్కుతో గుద్ది చంపేశాడో ట్రక్ డ్రైవర్. మతపరమైన ద్వేషంతో ఘటనకు పాల్పడి గుద్దిన వెంటనే దిగి పారిపోయాడని కెనడియన్ పోలీసులు చెప్తున్నారు. ‘ప్లాన్ ప్రకారమే ఘటనకు పాల్పడినట్లు ఉద్దేశ్యపూర్వకంగానే చేశాడని సాక్ష్యాలు ఉన్నాయి’ అని అధికారులు చెప్తున్నారు.
ఈ బాధితులు కేవలం ముస్లింలు అనే కారణంతోనే వారిని టార్గెట్ చేశారు. అనుమానితుడిగా గుర్తించి 20 సంవత్సరాల నాథనియేల్ వెల్టమన్ ను ఆదివారం అరెస్టు చేశారు. అతని ట్రక్కు రోడ్ పక్కనే ఆపేశారు. వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి గుద్దినట్లు స్థానికులు చెబుతున్నారు.
లండన్ లో ఉండే వెల్టమన్ చేసిన పనిని ఫస్ట్ డిగ్రీ మర్డర్ గా గుర్తించారు. హత్యాయత్నం కింద కేసు బుక్ చేసుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటి వరకూ ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు.