క్యాన్సర్ పేషెంట్‌కు కోటిన్నర లాటరీ

క్యాన్సర్ పేషెంట్‌కు కోటిన్నర లాటరీ

పేగుకు క్యాన్సర్ వచ్చి ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కోటిన్నర లాటరీ వరించింది. అదృష్టమంటే ఇదే కదా. పేగుకు క్యాన్సర్ వచ్చిందని కీమో థెరఫీ చేయించుకుంటూ ఇంకొక్కసారి ట్రీట్‌మెంట్ తీసుకుంటే జబ్బు తగ్గిపోతుంది. ఆ సమయంలోనే అతని జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఉత్తర కరోలినా రాష్ట్రంలోని పింక్‌హిల్స్‌కు చెందిన రోనీ ఫాస్టర్ అనే వ్యక్తి కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నాడు. 

కీమోథెరపీ చేయించుకుంటున్న అతను చివరి సెషన్ చికిత్స కోసం వెళ్తూ.. దారిలో బ్యూలవిల్లేలోని ఓ షాప్‌లో ఒక డాలర్‌ పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అది స్క్రాచ్ చేసి ఐదు డాలర్లు గెలుచుకున్నాడు. గెలిచిన డబ్బుతో మరో రెండు లాటరీ టికెట్లు కొనాలనుకున్నాడు. రెండు లక్షల డాలర్ల ప్రైజ్ మనీ వచ్చే రెండు టిక్కెట్లు కొన్నాడు. 

ముందు ఒకటి స్క్రాచ్ చేసేసరికి ఏమీ రాలేదు. ఇక రెండో కార్డు స్క్రాచ్ చేస్తుంటే ముందుగా సున్నాలు కనిపించాయి. షాక్ గురైన వ్యక్తి క్లర్క్ ను టిక్కెట్ స్కాన్ చేయమని ఇచ్చాడు. వచ్చిన ఫలితం చూసి షాక్ కావాల్సి వచ్చింది. రెండు లక్షల డాలర్లు(రూ.1.42కోట్లు) గెలుచుకున్నావని లాటరీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి కలవాల్సిందిగా సిబ్బంది చెప్పాడు. 

నాకు నిజంగానే సంతోషంతో పాటు ఆశ్చర్యంగా అనిపించింది. కీమో థెరఫీలో ఇది చివరి సెషన్. ఇది నా లక్కీ డే. టాక్స్‌లు ఇతరత్రా పోను రూ. కోటిపైగా రోనీ చేతికందాయి.  ట్రీట్మెంట్ కోసం అయిన ఖర్చుతో నష్టపోయిన తనకు ఈ లాటరీ డబ్బులు ఆసరాగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.