Bangladesh PM Sheikh Hasina: ఆ రెండు విషయాల్లో భారత్ సాయం మర్చిపోలేనిది.. నీటి విషయంలోనూ ఉదారతను చూపాలి..

కొవిడ్ మహమ్మారి సమయంలో, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆమె భారత్‌లో పర్యటించనున్నారు.

Bangladesh PM Sheikh Hasina: ఆ రెండు విషయాల్లో భారత్ సాయం మర్చిపోలేనిది.. నీటి విషయంలోనూ ఉదారతను చూపాలి..

Sheikh Hasina

Updated On : September 4, 2022 / 12:53 PM IST

Bangladesh PM Sheikh Hasina: కొవిడ్ మహమ్మారి సమయంలో, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు భారత్ లో ఆమె పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆమె కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ లతో సమావేశమవుతారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంప్రదిపులు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఏఎన్ఐ ఇంటరాక్షన్ లో మాట్లాడారు..

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద పొరుగు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ లను అందించిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో భారతదేశాన్ని ఆమె ‘ విశ్వసనీయ స్నేహితుడు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా రష్యా – ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో మా విద్యార్థులు చాలా మంది చిక్కుకుపోయారని, వారు ఆశ్రయం కోసం పోలాండ్‌కు వచ్చినప్పుడు భారతీయ విద్యార్థులను తరలించినప్పుడు, మా విద్యార్థులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ చొరవకు నేను ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని హసీనా అన్నారు.

తమ దేశ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి ఇరు దేశాల మధ్య చిరకాల నీటి భాగస్వామ్యం వివాదాన్ని పరిష్కరించాలని అన్నారు. మేము దిగువన ఉన్నాము. భారతదేశం నుండి నీరు వస్తోంది. కాబట్టి, భారతదేశం మరింత ఉదారతను ప్రదర్శించాలి. రెండు దేశాలు లబ్ధిదారులుగా ఉంటాయి. కొన్నిసార్లు ఇరుదేశాల ప్రజలు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా తీస్తా నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిని పరిష్కరించడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. అయితే సమస్య మీ దేశంలో ఉంది. మేము గంగా జలాన్ని మాత్రమే పంచుకుంటాము, కానీ మనకు మరో 54 నదులు ఉన్నాయి. ఇది చాలా కాలంగా ఉన్న సమస్య, పరిష్కరించబడాలని అన్నారు. ఇదిలాఉంటే  ఆమె చివరిసారిగా 2019లో అక్టోబర్ లో కరోనా వైరస్ కంటే ముందు భారతదేశాన్ని సందర్శించారు. మళ్లీ  రేపటి  నుంచి మూడు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్నారు.