Ambulance: అంబులెన్సును చోరీ చేసి.. 10 కార్లను ఢీ కొడుతూ ఎలా దూసుకెళ్లాడో చూడండి..
ఆ తర్వాత హైవేపై అనేక వాహనాలను ఢీ కొడుతూ అంబులెన్సును దొంగ తీసుకెళ్లాడని అధికారులు వివరించారు.

Viral Video
Ambulance – Virginia: అమెరికా(United States)లోని వర్జీనియాలో ఓ వ్యక్తి అంబులెన్సుని చోరీ చేసి దాన్ని తోలుతూ దూసుకెళ్లి దారిలో దాదాపు పది కార్లను ఢీ కొట్టాడు. ఆ అంబులెన్సు వెనుక కార్లలో వెళ్లిన పోలీసులు చివరికి ఈ కేటుగాడిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు.
ఆ అంబులెన్సుని దొంగ తీసుకెళ్తున్న సమయంలో స్ట్రీట్ బ్రిడ్జి-14ని మూసేశామని అధికారులు తెలిపారు. మొదట ఆ అంబులెన్సును కొట్టేసిన వ్యక్తి ఓ వాహనాన్ని ఢీ కొట్టాడని, ఆ సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. ఆ తర్వాత హైవేపై అనేక వాహనాలను ఢీ కొడుతూ అంబులెన్సును దొంగ తీసుకెళ్లాడని వివరించారు.
పోలీసులు ఆ అంబులెన్సును వెండిస్తున్న వేళ ఆ దొంగ అంబులెన్సును రివర్స్ తీసుకుని, పోలీసు కారును కూడా ఢీ కొట్టి దూసుకెళ్లాడు. అతడు సృష్టించిన బీభత్సానికి దాదాపు ఆరుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రాణాలు మిగిలాయని బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
MUST SEE: This is the start of I-395N rampage. Truck got on at 110N. Hit vehicles before Boundary Channel. Plowed into at least 5 before the bridge. Driver ran off. Will show you the stolen ambulance chase shortly. @ARLnowDOTcom @MetrorailSafety @TomJackmanWP #395rampage pic.twitter.com/dQyewlLcRW
— Dave Statter (@STATter911) August 12, 2023