జెషోరేశ్వరీ ఆలయంలోని కాళీమాత విగ్రహానికి మోదీ ఇచ్చిన కిరీటం చోరీ.. వీడియో

నిన్న ఆలయ పూజారి మందిరం నుంచి బయటకు వెళ్లిన అనంతరం మధ్యాహ్నం సమయంలో చోరీ జరిగింది.

జెషోరేశ్వరీ ఆలయంలోని కాళీమాత విగ్రహానికి మోదీ ఇచ్చిన కిరీటం చోరీ.. వీడియో

Updated On : October 11, 2024 / 7:07 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 మార్చిలో బంగ్లాదేశ్​ పర్యటనకు వెళ్లిన వేళ అక్కడి జెషోరేశ్వరీ ఆలయంలోని కాళీమాతకు ఇచ్చిన కిరీటం తాజాగా చోరీకి గురైంది. చోరీ సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

కిరీటం చోరీపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దాన్ని చోరీ చేసిన వారిని అరెస్టు చేసి, కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని బంగ్లా సర్కారుని కోరింది. ఆ ఆలయం శ్యామ్ ​నగర్​లో ఉంటుంది.

కాళీ మాతకు మోదీ కిరీటాన్ని కానుకగా సమర్పించగా అప్పటి నుంచి అమ్మవారికి దాన్ని పెడుతున్నారు. నిన్న ఆలయ పూజారి మందిరం నుంచి బయటకు వెళ్లిన అనంతరం మధ్యాహ్నం సమయంలో చోరీ జరిగింది. మందిరంలో పనిచేసే సిబ్బందే ఆ కిరీటాన్ని తీసినట్లు అధికారులు భావిస్తున్నారు.

వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలిస్తున్నారు. ఆ కిరీటాన్ని పడిసి, వెండితో తయారు చేశారు. ఆ కిరీటానికి సాంస్కృతికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాలను చూస్తే భారత ఉప ఖండంలోని 51 శక్తి పీఠాల్లో జెషోరేశ్వరీ ఆలయం కూడా ఒకటి.

ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Noel Tata: టాటా ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా నోయ‌ల్ టాటా.. ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న బోర్డు స‌భ్యులు