Water On Moon : చంద్రుడిపై నీరు ఏర్పడటానికి భూమే కారణమా? చంద్రయాన్ -1 డేటా సేకరణతో సంచలన విషయాలు వెలుగులోకి!

ప్రోటాన్ల వంటి అధిక శక్తి కలిగిన అణువులు ఉండే సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు నీరు ఏర్పడవచ్చని గతంలో పలు పరిశోధనల్లో వెల్లడైంది.

Water On Moon : చంద్రుడిపై నీరు ఏర్పడటానికి భూమే కారణమా? చంద్రయాన్ -1 డేటా సేకరణతో సంచలన విషయాలు వెలుగులోకి!

Water On Moon

Water On Moon – Earth Helped : చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనలు వెల్లడించాయి. భారత్ పంపించిన చంద్రయాన్ -1 కూడా చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. కానీ, వాతావరణమే లేని చంద్రుడిపై నీరు ఎలా ఏర్పడిందనేది చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఎలాగైనా చంద్రుడి గుట్టు విప్పాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ వల్లనే చంద్రుడిపై నీళ్లు వచ్చాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 మిషన్ సేకరించిన డేటాను విశ్లేషించిన హవాయి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపై ఉండే శిలలు, ఖనిజాలను విచ్చిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ క్రియలను భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ ప్రోత్సహించి ఉంటాయని అంటున్నారు. ప్రోటాన్ల వంటి అధిక శక్తి కలిగిన అణువులు ఉండే సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు నీరు ఏర్పడవచ్చని గతంలో పలు పరిశోధనల్లో వెల్లడైంది.

Moon Influence Earth Climate : భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న చంద్రుడు

అయితే భూ అయస్కాంత వాతావరణం గుండా చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని తాకడం చాలా కష్టం. అలాంటి సమయంలో చంద్రుడిపై ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవాలని అమెరికాలోని మనోవాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో 2008లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-1 మిషన్ పంపించిన డేటాను విశ్లేషించింది.

చంద్రయాన్-1 మిషన్ లోని ఇమేజింగ్ స్పెక్ట్రో మీటర్ అయిన మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం
సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను అధ్యయనం చేయగా భూ అయస్కాంత వాతావరణంలో
ప్రయాణిస్తున్న సమయంలో కూడా చంద్రుడిపై నీరు ఏర్పడినట్లు పేర్కొంది. అంటే సౌర గాలిలోని ప్రోటాన్లతో సంబంధం లేకుండానే భూ వాతావరణంలోని అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ ద్వారా కూడా నీటి అణువులు ఏర్పడ్డాయని గుర్తించారు.