చంద్రయాన్-2 ల్యాండర్ పడింది ఇక్కడే..

చంద్రయన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చందమామపై హర్డ్ ల్యాండింగ్ అయి ఆచూకీ లేకుండా పోయింది. అక్కడ ఉన్న చీకటి వల్ల పడిన ఆనవాళ్లు కూడా గుర్తించలేకపోయాం. సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించినట్లు తెలిపింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా.
సంబంధించిన ఫొటోల్ని షేర్ చేస్తూ.. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది. నాసాకు చెందిన ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ఈ ల్యాండర్‌ను గుర్తించి ఫొటోలు తీసింది. కూలిన ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడినట్లు తెలిపింది. మొత్తం 24 చోట్ల ఈ శకలాలు పడినట్లు గుర్తించింది. ఓవరాల్‌గా కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఇవి ఉన్నట్లు వెల్లడించింది.
షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి ల్యూనార్ రికన్నాయ్‌స్సాన్స్ ఆర్భిటర్ (LRO) ప్రాజెక్టు సభ్యుల్ని కాంటాక్ట్ అయ్యారు. తొలిసారిగా విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి ఓ విడి భాగాన్ని పడిన ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో గుర్తించారు. తద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందీ తెలిసింది. 2019 జులైలో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని మొదలుపెట్టింది.
అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై ల్యాండర్‌ను దింపిన దేశం భారతే. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపిన తొలి దేశం భారతే. ప్రస్తుతం చంద్రయాన్-2లో కీలకమైన ఆర్బిటర్ చందమామ చుట్టూ బ్రహ్మాండంగా తిరుగుతోంది.