Russia Ukraine War: రష్యా సైనికులను తికమకపెడుతున్న యుక్రెయిన్ పౌరులు

ఎన్ని బాంబులు వేసినా, ఎంత నష్టం చేకూర్చినా.. యుక్రెయిన్ వాసులు తమ నగరాలను వదిలి వెళ్లకపోగా..రష్యా సైన్యంపై ఎదురు దాడులు చేస్తున్నారు

Russia Ukraine War: రష్యా సైనికులను తికమకపెడుతున్న యుక్రెయిన్ పౌరులు

Band

Updated On : March 13, 2022 / 7:13 AM IST

Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. యుక్రెయిన్ సైన్యానికి తోడు దేశ ప్రజలు సైతం వాలంటీర్లుగా యుద్ధంలో చేరి రష్యా పై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. యుక్రెయిన్ సైనికులు, పౌరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న రష్యా సైన్యం..చావు దెబ్బతినింది. ఎన్ని బాంబులు వేసినా, ఎంత నష్టం చేకూర్చినా.. యుక్రెయిన్ వాసులు తమ నగరాలను వదిలి వెళ్లకపోగా..రష్యా సైన్యంపై ఎదురు దాడులు చేస్తున్నారు. దీంతో ఎలాగైనా వాటిని తిప్పికొట్టేలా రష్యా సైన్యం ఎత్తుగడ వేసింది. దాడుల సమయంలో యుక్రెయిన్ వాసులు తమ పౌరులను, సైన్యాన్ని గుర్తించేలా మొదట పసుపు రిబ్బన్ ను కట్టుకున్నారు. అది గమనించిన రష్యా సైనికులు.. యుక్రెయిన్ వాసులతో కలిసిపోయేలా తాము కూడా పసుపు రిబ్బన్ ధరించి.. దొంగ దెబ్బ తీయడం ప్రారంభించారు. ఇది కనిపెట్టిన యుక్రెయిన్ ప్రజలు.. మరో ఎత్తుగడతో ముందుకువచ్చారు.

Also read: Congo Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి!

పసుపు రిబ్బన్ బదులుగా ఇపుడు నీలం రంగు రిబ్బన్ ధరించారు యుక్రెయిన్ సైనికులు మరియు పౌరులు. కేవలం యుక్రెయిన్ పౌరులు సైనికుల మధ్య రహస్య సందేశాల మార్పిడి ద్వారా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నీలం రంగు రిబ్బన్ ధరించడంతో శత్రువులెవరో మిత్రులు ఎవరో కనిపెట్టడం సులభంగా మారింది. దీనికితోడు.. రష్యాపై యుద్ధాన్ని సమర్థిస్తూ యుక్రెయిన్ లోనూ కొందరు సంఘవిద్రోహ శక్తులు రష్యా సైన్యానికి మద్దతు ఇస్తున్నారు. వారు యుక్రెయిన్ ప్రజలతోనే ఉంటూ రష్యా సైనికులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ఈ రిబ్బన్ ఆలోచనతో ముందుకు వచ్చిన యుక్రెయిన్ ప్రజలు..సంఘవిద్రోహులను గుర్తించి దెబ్బతీస్తున్నారు. ప్రస్తుతం రిబ్బన్ రంగు మారిపోవడంతో రష్యా సైనికులు గందరగోళానికి గురవుతున్నారు. రష్యా సైనికులపై ఎదురు దాడి చేస్తున్నారు యుక్రెయిన్ సైనికులు, ప్రజలు. అయితే ఈ తరహా ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చేస్తూ రష్యా సైనికులను తికమకపెడుతున్నారు యుక్రెయిన్ ప్రజలు.

Also read: Russia Ukraine Army: రష్యాకు మద్దతుగా సిరియన్ ఫైటర్లు..!