Covid-19: కొవిడ్ ల్యాబ్‌లో లీక్ అయిందనేది పెద్ద అబద్ధమంటోన్న చైనా

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చైనాలోని ల్యాబ్ లో లీక్ అయి విస్తరించదనడం అబద్ధమని చైనా నొక్కి చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సిఫారసు మేర రాజకీయ కారణాలతో పుట్టిన అబద్ధమంటూ.. వివరణ కోసం లోతైన పరిశోధన జరపాలంటూ వెల్లడించింది.

Covid-19: కొవిడ్ ల్యాబ్‌లో లీక్ అయిందనేది పెద్ద అబద్ధమంటోన్న చైనా

Covid 19 Update India Reports 3,207 Fresh Covid 19 Cases, 29 Deaths In The Last 24 Hours (1)

Updated On : June 13, 2022 / 6:50 AM IST

Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చైనాలోని ల్యాబ్ లో లీక్ అయి విస్తరించదనడం అబద్ధమని చైనా నొక్కి చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సిఫారసు మేర రాజకీయ కారణాలతో పుట్టిన అబద్ధమంటూ.. వివరణ కోసం లోతైన పరిశోధన జరపాలంటూ వెల్లడించింది.

చైనా పరిశోధకులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ పూర్తిగా సహకరించలేదనే ఆరోపణలను తిరస్కరించారు. సైన్స్ ఆధారిత దర్యాప్తును స్వాగతిస్తున్నామని, మధ్యలో నెలకొన్న రాజకీయ అవకతవకలను మాత్రం తిరస్కరించామని చెప్పారు.

యునైటెడ్ స్టేట్స్‌లోని “ఫోర్ట్ డెట్రిక్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా వంటి అత్యంత అనుమానాస్పద ప్రయోగశాలలపై” దర్యాప్తు కోసం పిలుపునిచ్చాడు. ఇక్కడ చైనా ఎటువంటి ఆధారాలు లేకుండా, యూఎస్ కరోనావైరస్‌ను బయోవీపన్‌గా అభివృద్ధి చేస్తోందని సూచించింది.

Read Also : చైనాలో కరోనా డేంజర్ బెల్స్.. బీజింగ్‌లో మిలియన్ల మందికి కొవిడ్ పరీక్షలు..!

“ల్యాబ్‌లో లీక్ జరిగిందని చెప్పడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చైనా వ్యతిరేక శక్తులచే రూపొందించబడిన అబద్ధం, దీనికి సైన్స్‌తో సంబంధం లేదు” అని జావో రోజువారీ సమావేశంలో అన్నారు.

“ఎల్లప్పుడూ సైన్స్ ఆధారిత గ్లోబల్ వైరస్ ట్రేసింగ్‌లో సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఏ విధమైన రాజకీయ అవకతవకలకు పాల్పడితే గట్టిగా వ్యతిరేకిస్తాం” అని అతను చెప్పాడు. వైరస్ జాడను గుర్తించడంలో చైనా ప్రధానంగా కృషి చేసిందని, అత్యధిక డేటా, పరిశోధన ఫలితాలను ఇచ్చిందని జావో చెప్పారు.