Hypersonic Missile : అది వేరే..హైపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ చేయలేదన్న చైనా

ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్​సోనిక్​ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు వచ్చిన వార్తలను డ్రాగన్ ఖండించింది. తాము పరీక్షించింది

Hypersonic Missile : అది వేరే..హైపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ చేయలేదన్న చైనా

China2

Hypersonic Missile ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్​సోనిక్​ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు వచ్చిన వార్తలను డ్రాగన్ ఖండించింది. తాము పరీక్షించింది అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే ఓ స్పేస్ వెహికిల్‌ను మాత్రమేనని, అది హైప‌ర్‌సోనిక్ మిసైల్ కాద‌ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి జావో లిజియాన్ తెలిపారు.

సోమవారం బీజింగ్ లో నిర్వహించినయ మీడియా సమావేశంలో జావో లిజియాన్ మాట్లాడుతూ…ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్​సోనిక్​ మిసైల్ పరీక్షించామన్నది పూర్తిగా అవాస్తవం. వివిధ రకాల పునర్వినియోగ అంతరిక్ష నౌక సాంకేతికతను ధృవీకరించడానికి ఈ ఏడాది జూలైలో సాధారణ సాధారణ అంతరిక్ష వాహన పరీక్ష నిర్వహించామని,తాము పరీక్షించి క్షిపణి కాదని సృష్టం చేశారు.

అంతరిక్ష రంగానికి సంబంధించిన ఈ ప్రయోగం మానవాళికి ఉపకరిస్తుందన్నారు. అంతరిక్షం నుంచి మనుషులను తక్కువ ఖర్చుతో తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో అనేక దేశాలు కూడా ఇలాంటి పరీక్షలు నిర్వహించాయని జావో తెలిపారు. అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకునేలా ప్రపంచ దేశాలతో కలిసి చైనా పనిచేస్తుందన్నారు.

హైపర్ సోనిక్ మిసైల్ ఏంటీ

బాలిస్టిక్ క్షిపణుల తరహాలో ఇవి కూడా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలవు. కాగా, సాధారణ బాలిస్టిక్ క్షిపణులు నింగిలోకి లేచి.. అంతరిక్షంలోకి దూసుకెళ్లి.. తిరిగి భూమి దిశగా దూసుకొస్తాయి. నిర్దేశించిన లక్ష్యంపై పడతాయి. ఆర్చి ఆకారంలో వీటి పయనం సాగుతుంది. హైపర్ సోనిక్ అస్త్రం మాత్రం తక్కువ ఎత్తుకే (భూ దిగువ కక్ష్యకు) చేరుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి శక్తి అవసరం లేకుండానే వేల కిలోమీటర్ల పాటు గ్లైడర్ లా పయనిస్తూ నిర్దేశించిన లక్ష్యంపైకి దూసుకెళుతుంది. దీన్ని హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు. చాలా వేగంగా టార్గెట్ పై విరుచుకుపడగలవు. క్రూజ్ క్షిపణులూ వీటిలో ఉంటాయి. తమ యాత్ర మొత్తం స్వీయ ఇంజిన్ సాయంతోనే పయనిస్తుంటాయి. బాలిస్టిక్ క్షిపణులకు భిన్నంగా హైపర్ సోనిక్ అస్త్రాలను మార్గ మధ్యలో నియంత్రించి కోరుకున్న రీతిలో వాటిని పయనాన్ని నిర్దేశించొచ్చు.

ASLO READ Hypersonic Missile : డ్రాగన్ దూకుడు.. అణు సామర్థ్యం కలిగిన హైపర్​సోనిక్​ మిసైల్ ప్రయోగించిన చైనా