Hypersonic Missile : డ్రాగన్ దూకుడు.. అణు సామర్థ్యం కలిగిన హైపర్​సోనిక్​ మిసైల్ ప్రయోగించిన చైనా

అంతరిక్షానికి సంబంధించి చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్​సోనిక్​ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు

Hypersonic Missile : డ్రాగన్ దూకుడు.. అణు సామర్థ్యం కలిగిన హైపర్​సోనిక్​ మిసైల్ ప్రయోగించిన చైనా

China

Hypersonic Missile: అంతరిక్షానికి సంబంధించి చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్​సోనిక్​ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు తాజాగా బ్రిటన్​కు చెందిన వార్తాపత్రిక “ఎన్​హెచ్​కే వరల్డ్​” తెలిపింది. లాంగ్ మార్చ్ రాకెట్ నుంచి ఆగస్టులో చేపట్టిన ఈ ప్రయోగాన్ని చైనా రహస్యంగా ఉంచింది.

ఈ మిసైల్.. గగనతలంలో తక్కువ ఎత్తు నుంచే ప్రయాణించిందని, అయితే లక్ష్యం మాత్రం గురి తప్పినట్లు బ్రిటన్ వార్తాపత్రిక తెలిపింది. దాని లక్ష్యం వైపు వెళ్లడానికి ముందు తక్కువ కక్ష్యలో భూమి చుట్టూ ఈ మిసైల్ ప్రదక్షిణ చేసిందని తెలిపింది. క్షిపణి లక్ష్యానికి 32 కిమీ దూరంలో వెళ్లిందని.. ప్రయోగం విజయవంతం కాకున్నా.. హైపర్​సోనిక్​ మిసైల్ టెక్నాలజీపై చైనా పురోగతి అమెరికా ఇంటెలిజెన్స్ ను షాక్​కు గురి చేసిందని తెలిపింది.

అయితే.. అమెరికా, రష్యాతో పాటు మరో ఐదు దేశాలు ఇప్పటికే ఈ హైపర్​సోనిక్​ మిసైల్స్ ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ మిస్సైల్​ను చైనా కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే అమెరికా, జపాన్​ క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

ALSO READ బీసీసీఐలో పెద్ద ఉద్యోగాలు.. 9రోజుల్లోగా అప్లై చేసుకోవాలి