‘బైబై జిన్ పింగ్’.. చైనాలో కొత్త శకం ఆరంభం అవుతోందా? జిన్ పింగ్ సైడ్ అయిపోయినట్టేనా? వారసుడు ఎవరు?

ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా షి జిన్‌పింగ్ గుర్తింపు పొందాడు. అయితే, ఇక ఆయన శకం కూడా ముగియబోతున్నట్లు కనిపిస్తోంది.

‘బైబై జిన్ పింగ్’.. చైనాలో కొత్త శకం ఆరంభం అవుతోందా? జిన్ పింగ్ సైడ్ అయిపోయినట్టేనా? వారసుడు ఎవరు?

Xi Jinping

Updated On : July 3, 2025 / 4:32 PM IST

China: చైనాలో ఏం జరుగుతోంది.. ఆ దేశంలో షి జిన్‌పింగ్ శకం మరికొద్ది రోజుల్లో ముగియనుందా..? ఆయన స్థానంలో కొత్త వ్యక్తి చైనా అధ్యక్ష పగ్గాలు అందుకోబోతున్నారా.. ఆమేరకు ఇప్పటికే అంతర్గతంగా ప్రక్షాళన మొదలైందా.. జిన్‌పింగ్ స్థానంలో మరో నేతను ఎన్నుకునేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్థానంలో ప్రధాని లీ కియాంగ్ హాజరవుతుండటం చైనాలో జిన్‌పింగ్ శకం ముగిసిందనే వాదనకు బలచేకూరినట్లయింది.

Also Read: Japan: భయంతో వణికిపోతున్న జపనీయులు.. రెండ్రోజుల్లో ఏం జరగబోతోంది..? న్యూ బాబా వాంగా అంచనాలు నిజం కాబోతున్నాయా.. తలలు పట్టుకుంటున్న అధికారులు

ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా షి జిన్‌పింగ్ గుర్తింపు పొందాడు. అయితే, ఇక ఆయన శకం కూడా ముగియబోతున్నట్లు కనిపిస్తోంది. కొన్నిరోజులుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారిక కార్యక్రమాలో కనిపించడం లేదు. ఎప్పుడూలేని విధంగా బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరవుతున్నారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఈ నెల 6 నుంచి 7 వరకు జరిగే బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరుకాబోతున్నారు. వీటన్నింటిని బట్టిచూస్తే వయోభారంతో ఇబ్బంది పడుతున్న జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ పక్కకు తప్పించబోతుందని, అధ్యక్షుడి మార్పునకు ఇది సంకేతమంటూ కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. సమయం వస్తే అధినేతలనైనా చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టడం రివాజేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జిన్‌పింగ్ వయోభారంతో బాధపడుతున్నాడని.. ఆయన అధ్యక్ష స్థానం నుంచి వైదొలగబోతున్నాడని తెలుస్తోంది. జిన్‌పింగ్ మూడోసారి అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన జనరల్ ఝాంగ్ యాక్సియా జిన్‌పింగ్ వారసుడిగా రాబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం అత్యున్నత అధికారాలన్నీ యాక్సియా దగ్గరే ఉన్నాయి. అప్పట్లో యాక్సియాకు దక్కాల్సిన అధ్యక్షస్థానాన్ని జిన్‌పింగ్ కొట్టేశాడన్న ప్రచారమూ ఉంది. అయితే, ప్రస్తుతం సైన్యంలో జిన్‌పింగ్ మద్దతుదారులను యాక్సియా తప్పిస్తున్నారని, ఇప్పుడు జిన్‌పింగ్‌కు మేకులా యాక్సియా తయారయ్యారని.. అంతర్గతంగా అన్నిపనులను చకచకా చక్కబెట్టేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

జిన్‌పింగ్ తరువాత చైనాలో చక్రం తిప్పేది ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. యాక్సియాతోపాటు వాంగ్ యంగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నివేదికల ప్రకారం.. వాంగ్ యాంగ్ చైనాకు కాబోయే భవిష్యత్ నాయకుడని తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజుల సమయం పడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.