Japan: భయంతో వణికిపోతున్న జపనీయులు.. రెండ్రోజుల్లో ఏం జరగబోతోంది..? న్యూ బాబా వాంగా అంచనాలు నిజం కాబోతున్నాయా.. తలలు పట్టుకుంటున్న అధికారులు
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ గురించి తెలిసిందే. ఆమె మాదిరిగానే జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం.

Japan Tsunami
Japan: 2025 జులై 5వ తేదీ.. ఈ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ జపనీయులు భయంతో వణికిపోతున్నారు. ఈ తేదీకి మరో రెండు రోజులే గడువు ఉండటంతో ఏం జరగబోతుంది.. ఎలాంటి విపత్తును ఎదుర్కోబోతున్నామని ఆందోళన చెందుతున్నారు. జులై 5వ తేదీన జపాన్‌లో ఓ భారీ సునామీ వస్తుందని, దాంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి పేర్కొనడంతో జపనీయులు ఆందోళ చెందుతున్నారు.
Also Read: 2026 మేడారం మహాజాతర తేదీలు ఖరారు… వన దేవతల దర్శనం ఎప్పుడంటే?
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ గురించి తెలిసిందే. ఆమె మాదిరిగానే జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం. రియో టాట్సుకి 1999లో ‘ది ప్యూచర్ ఐ సా’ (నేను దర్శించిన భవిష్యత్తు) అనే పుస్తకాన్ని స్వయంగా రాశారు. అందులో బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీ, కరోనా వైర్ తదితరాలను అందులో ఆమె ముందుగానే చెప్పారు. మళ్లీ 2021లో పున: ముద్రణలో 2025 జులై5వ తేదీన జపాన్‌ను భారీ సునామీ ముంచెత్తుందని ఆమె అంచనా వేశారు.
జపాన్ లో 2011 సంవత్సరంలో భారీ సునామీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి భారీ భూకంపం, సునామీని కూడా టాట్సుకీ ముందుగానే ఊహించి హెచ్చరించారు. ఈ జులై5న జపాన్ లో ఏర్పడే ప్రళయం 2011లో ఈశాన్య జపాన్ ను నాశనం చేసిన సునామీ కంటే భారీగా ఉంటుందని, జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె హెచ్చరించింది. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చునని ఆమె ఊహించారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం మరుగుతున్నట్టు, భారీ బుడగలు ఏర్పడుతున్నట్టు ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
I went down the Ryo Tatsuki rabbit hole and I think we’re seriously not ready for July 5, 2025.
She predicted Covid, Diana, earthquakes — now she says a massive tsunami is coming.
I have receipts. 🧵👇 pic.twitter.com/OvoMPxUfM2— 0xNachh (@0xnachh) June 9, 2025
టాట్సుకీ అంచనాలు పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆమె అంచనాల కారణంగా జపాన్‌కు వచ్చే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. భూకంపం శాస్త్రవేత్తలు, ప్రభుత్వ సంస్థలు ఇంటువంటి సంఘటనలకు ఖచ్చితమైన తేదీలతో అంచనా వేయలేమని చెప్పారు. జపాన్ వాతావరణ శాఖ.. టాట్సుకీ అంచనా వేసిన సంఘటనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని పేర్కొంది. జులై5న ప్రశాంతత వాతావరణం ఉంటుందని బహిరంగ ప్రకటన విడుదల చేసింది. కానీ, టాట్సుకి అంచనాలను బలంగా విశ్వసించే పర్యాటకులు జపాన్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో జూన్ చివరి నుంచి జులై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83శాతం పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.