China To Laos Train : చైనా నుంచి లావోస్‌కు రైలు..ప్రారంభించిన రెండు దేశాల అధినేతలు

చైనా నుంచి లావోస్‌కు డైరెక్ట్ రైలు..ప్రారంభమైంది. ఈ రైలును రెండు దేశాల అధినేతలు ప్రారంభించారు.

China To Laos Train (1)

China To Laos Train : చైనా టెక్నాలజీలో ఎంత వేగంగా దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బుల్లెట్ ట్రైన్ తో ప్రపంచాన్ని తనవైను దృష్టిసారించేలా చేసిన డ్రాగన్ దేశం మరో ప్రయాణ మార్గాన్ని ప్రారంభించింది. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం శుక్రవారం (డిసెంబర్ 3,2021) ప్రారంభించింది. చైనాను లావోస్‌తో కలిపే ఈ రైలు రెండు దేశాల మధ్య ప్రజా, వాణిజ్య సంబంధాల పెరగటానికి ఉపయోగపడుతుందని చైనా ప్రకటించింది.

చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌ నుంచి లావోస్‌ రాజధాని వియంటియాన్‌కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్‌ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు కావడం గమనించాల్సిన విషయం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌,లావోస్‌ ప్రధాని థాంగ్లూన్‌ సిసోలిత్‌ సిసోలిత్ వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టు విలువ 600 కోట్ల డాలర్లు. 2016లో నిర్మాణం ప్రారంభమైంది. 1035 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కున్‌మింగ్‌ను, వియంటియాన్‌ను కలుపుతుంది. సాధారణంగా లావోస్‌ రాజధాని నుంచి చైనా సరిహద్దుకు చేరడానికి రెండు రోజులు పడుతుంది. ఈ రైలుతో ఆ సమయం మూడు గంటలకు పరిమితం కానుంది.

కాగా..మొదటి రైలు చైనాలోని యున్నన్ ప్రావిన్సుకు చెందిన కన్మింగ్ నుంచి లావోస్‌లోని వియంటియానెకు బయల్దేరి వెళ్లిందని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. చైనాతోపాటు వియత్నాం, థాయ్‌ల్యాండ్, మయన్మార్, కాంబోడియా దేశాల సరిహద్దులను లావోస్ పంచుకుంటోంది. ఆగ్నేయాసియాలోని ఈ దేశాలకు కూడా రైలు ప్రాజెక్టును విస్తరించాలని చైనా భావిస్తోంది. చైనాలాగే లావోస్ కూడా కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉంది. లావోస్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ లావోస్ దేశంలో అధికారంలో ఉంది.

ఈ హై స్పీడ్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంగాతో ప్రయాణిస్తుంది. దీంతో ప్రయాణం సమయం భారీగా తగ్గనుంది. గతంతో చైనా నుంచి లావోస్ కు వెళ్లాలంటే రెండు రోజుల సమయం పట్టేది. ఈ రైలు ప్రయాణంతో కేవలం గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైలు చైనా నుంచి లావోస్ రాజధాని వియంటియాన్ వద్ద థాయ్ లాండ్ కు చేరుకునే దారిలో 167 బ్రిడ్జిలు దాటి..75 సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో..ఈ సరికొత్త బుల్లెట్ ట్రైన్‌ రెండు రోజులు పట్టే ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తు..కేవలం 10 నుంచి 15 గంటల్లో చేరుకుంటుంది.