కరోనావైరస్ కంటే ప్రమాదకర వైరస్‌ను కనిపెట్టిన చైనా

  • Published By: vamsi ,Published On : August 27, 2020 / 07:17 AM IST
కరోనావైరస్ కంటే ప్రమాదకర వైరస్‌ను కనిపెట్టిన చైనా

Updated On : August 27, 2020 / 6:37 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు భయపడుతుంటే.. ఈ వైరస్ పుట్టిన చైనా దేశం మరో వైరస్ గురించి చెప్పి ఆందోళన పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ దేశంలో పుట్టిన కరోనా వైరస్‌కు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది గురయ్యారు. ఇదిలా ఉంటే తమ పొరుగున ఉన్న కజకిస్థాన్‌లో కరోనా కంటే ప్రమాదకరమైన కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు చైనా ప్రకటించింది.



అంతుచిక్కని ఈ వైరస్‌ కారణంగా వందలాది మంది చనిపోతున్నారని, కరోనా వైరస్ కంటే ఇది ప్రమాదకరమైన వైరస్ అని చైనా చెబుతుంది. దీనిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కజకిస్థాన్‌లోనికొత్త “తెలియని న్యుమోనియా” కారణంగా COVID-19 కన్నా ఎక్కువ మరణాల రేటు వస్తుందని, కేసులు కూడా వేగంగా పెరిగిపోతున్నట్లు చైనా రాయబార కార్యాలయం సూచనలు చేసింది. వైద్య నిపుణులు పరిశోధనల్లో కూడా ఇది ఏంటనేది గుర్తించలేకపోయారని చైనా చెబుతుంది.
https://10tv.in/pranab-mukherjee-still-in-deep-coma-renal-parameters-slightly-deranged-hospital/
అయితే చైనా రేకెత్తించిన ఆందోళనల నేపథ్యంలో కజకిస్తాన్ అధికారులు నివేదికలను సమకూర్చాలని నిర్ణయించుకున్నారు. చైనా చెబుతున్న మొత్తం విషయాన్ని ఖండించారు. చైనా మాత్రం తన వాదనలపై వెనక్కి తగ్గట్లేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కజకిస్తాన్ మార్చి మధ్యలో లాక్‌డౌన్‌‌లోకి వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన అనేక పరిమితులను అమలు చేసింది. ఈ క్రమంలో COVID-19 కేసులు ఆ దేశంలో తగ్గిపోయాయి. మే ప్రారంభంలో లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయడానికి దేశం నిర్ణయం తీసుకుంది. అయిత ఇటీవల, సంక్రమణ రేటు మరోసారి పెరిగిపోవడం ప్రారంభించింది.



దేశంలో ఇటీవల ఒకే రోజులో దాదాపు 2 వేల కొత్త COVID-19 కేసులను నివేదించారు అధికారులు, ఇది ఆ దేశానికి రికార్డు. ప్రభుత్వం దీనిని “రెండవ తరంగం” అని చెబుతుంది. అయితే దేశంలో కొత్త వైరస్ ప్రబలంగా ఉందా? లేదా? అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. కజకిస్తాన్ అధికారులు దేశంలో న్యుమోనియా కేసులలు భారీగా పెరుగుతున్నట్లు గుర్తించారు. కరోనావైరస్ కంటే అధ్వాన్నంగా ఉన్న ఒక కొత్త వైరస్ నిజంగా దేశంలో ఉంటే, అది ఖచ్చితంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అక్కడి వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చైనా ఈ వాదనను ఇప్పటికే నెలకుపైగా చేస్తూ వస్తుంది. మరోసారి అదే వాదనను గట్టిగా పత్రికల ద్వారా చెబుతుంది.