China: మరో కలకలం.. అణు బాంబుల పరీక్షకు సిద్ధమైన చైనా.. ప్రపంచానికి ఇలా తెలిసిపోయింది..

కొత్త తర బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులకు అమర్చేందుకు డిజైన్ చేసిన అత్యాధునిక న్యూక్లియర్ వార్‌హెడ్‌ల సామర్థ్యాన్ని పరీక్షించాలని..

China: మరో కలకలం.. అణు బాంబుల పరీక్షకు సిద్ధమైన చైనా.. ప్రపంచానికి ఇలా తెలిసిపోయింది..

Nuclear Weapons Test

Updated On : December 22, 2023 / 8:54 PM IST

Nuclear Weapons Test: చైనా అణ్వాయుధాల పరీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా చైనా చర్యలు బయటపడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ ఈ శాటిలైట్ చిత్రాలను ప్రచురించింది. జిన్జియాన్ ప్రాంతంలోని లోప్ నూర్ అణు పరీక్షల కేంద్రాన్ని చైనా తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

త్వరలోనే చైనా పూర్తి స్థాయిలో న్యూక్లియర్ టెస్టులు చేయనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త తర బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులకు అమర్చేందుకు డిజైన్ చేసిన అత్యాధునిక న్యూక్లియర్ వార్‌హెడ్‌ల సామర్థ్యాన్ని పరీక్షించాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు చైనా అణు పరీక్షలకు సిద్ధమవుతున్న లోప్ నూర్ అణు పరీక్షల కేంద్రంలోనే ఆ దేశం 1964 సెప్టెంబరు 16న మొదటిసారి న్యూక్లియర్ టెస్టులు చేసింది. అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతిన్న వేళ లోప్ నూర్‌లోనే చైనా ఇప్పుడు మళ్లీ ఇటువంటి ‘అణు’ చర్యలకు పాల్పడుతుండడం చాలా సున్నితమైన విషయమని నిపుణులు అంటున్నారు.

అణ్వాయుధాల సంఖ్యను మరింత పెంచుకోవాలని చైనా భావిస్తోందని చెబుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన తాజా రిపోర్టులను చైనా ఖండించింది.

Pakistan: 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. అడుక్కుంటుండగా చూసిన తల్లి