Pakistan: 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. అడుక్కుంటుండగా చూసిన తల్లి
తహ్లీ మొక్రి చౌరస్తాలో యాచకుల ముఠాతో కలిసి బిక్షాటన చేస్తుండగా గుర్తు పట్టింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ ముఠా అంగవైకల్యంతో ఉన్న ముస్తాకీమ్‌తో బలవంతంగా భిక్షాటన చేయించింది.

పాకిస్తాన్లోని రావల్పిండిలో ఉద్వేగభరతితమైన సన్నివేశంలో తల్లీ కొడుకులు కలుసుకున్నారు. అది కూడా ఏడేళ్ల తర్వాత. 2016లో తప్పిపోయిన కొడుకును మళ్లీ ఇన్నేళ్లకు ఆ తల్లి కలుసకుంది. కానీ, ఆ సమయంలో అతడు అడుక్కుంటుండగా చూసి ఆమె హృదయం చలించిపోయింది. రావల్పిండిలోని తహ్లి మోహ్రీ చౌరస్తా వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పాకిస్తాన్ లీడింగ్ పత్రిక డాన్ వెల్లడించింది.
తల్లి పేరు షహీన్ అఖ్తర్. తప్పిపోయిన కొడుపు పేరు ముస్తకీర్ ఖలీద్. యాచకుల ముఠాలో ఉన్న తన కొడుకును తల్లి గుర్తు పట్టింది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ముస్తకీర్ 2016లో టైఫాయిడ్ జ్వరం కారణంగా అనుకోని సందర్భంలో అదృశ్యమయ్యాడు. ఈ విషయమై సివిల్ లైన్స్ పోలీసులకు తల్లి అప్పట్లోనే ఫిర్యాదు చేసింది. మానసిక వికలాంగుడైన తన కుమారుడు తరుచుగా డిప్రెషన్ కారణంగా ఇంటిని విడిచిపెడుతుంటాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి గ్రామస్తులు అతడిని ఆ సమయంలో తీసుకువచ్చినప్పటికీ మరోసారి తప్పిపోయి మళ్లీ దొరకలేదు.
ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీలు పారిపోయారు.. పార్లమెంట్ దాడిపై రాహుల్ గాంధీ విసుర్లు
ఇక అతడు తహ్లీ మొక్రి చౌరస్తాలో యాచకుల ముఠాతో కలిసి బిక్షాటన చేస్తుండగా గుర్తు పట్టింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ ముఠా అంగవైకల్యంతో ఉన్న ముస్తాకీమ్‌తో బలవంతంగా భిక్షాటన చేయించింది. తన కొడుకు దగ్గరికి వెళ్లి బిగ్గరగా కౌగిళించుకుని కన్నీరుమున్నీరైంది. అయితే యాచకుల ముఠా ఆమెపై దాడి చేసింది. ఆమెను తీవ్రంగా దుర్భషలాడింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముగ్గురు సభ్యల యాచకుల ముఠాతో పాటు ఆ ముఠా నాయకుడు వాహిద్ ను అరెస్ట్ చేసి ముస్తకీర్ ను తన తల్లికి అప్పగించారు.