అమెరికాలో మా విద్యార్థుల వీసాల రద్దు జాతివివక్షే, భోరుమన్న చైనా

china student visa cuts: అమెరికాలో చైనా విద్యార్థుల వీసాల రద్దు నిర్ణయంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. దాదాపు వెయ్యి మందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. వీసాలు రద్దు రాజకీయ కక్ష మాత్రమేకాదు, జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది.
రాజకీయ కారణాలతో చైనా విద్యార్థులను అణచిస్తున్నారని, వెంటనే ఆపాలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లిజియాన్ స్పష్టం చేశారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు.