China : కిరాణ సామాను తెచ్చుకోవడానికి ఒకరికి మాత్రమే అనుమతి

ఆహార పదార్థాలు అయిపోయాయని.. తమను బయటికి రానివ్వడం లేదని.. ఆకలితో చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు విగో వేదికగా పోస్టులు పెడుతున్నారు.

China : కిరాణ సామాను తెచ్చుకోవడానికి ఒకరికి మాత్రమే అనుమతి

China Lock Down

Updated On : December 29, 2021 / 5:20 PM IST

Xi’an Lockdown : చైనాలో కరోనా పరిస్థితులు కల్లోలం సృష్టిస్తున్నాయి. 21 నెలల్లోనే ప్రస్తుతం అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండటంతో మళ్లీ ఆంక్షల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కోటీ 30లక్షల జనాభా ఉన్న జియాన్‌ నగరంలో కఠిన లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. తాజాగా యానాన్ నగరంలో లక్షలాది మందిని ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలతో పోల్చితే స్థానికంగా తక్కువ కేసులే నమోదవుతున్నా.. చైనా తన జీరో కొవిడ్ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది.

Read More : CM Jagan Honor Kidambi Srikanth : రూ.7లక్షల నగదు, 5ఎకరాల భూమి.. శ్రీకాంత్‌కు సీఎం జగన్ సన్మానం

జియాన్‌ నగరంలో వారం రోజులుగా కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. డ్రైవింగ్‌పై నిషేధం, మూడు రోజులకోసారి మాత్రమే కిరాణా సామగ్రి తెచ్చుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. అదీ కూడా ఇంటినుంచి ఒకరికి మాత్రమే బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఈ నిబంధనలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Read More : Rs.25 discount on liters petrol : లీటర్ పెట్రోల్‌పై రూ.25 త‌గ్గింపు! ప్ర‌భుత్వం కొత్త సంవత్సరం కానుక..!!

ఇంట్లో ఆహార పదార్థాలు అయిపోయాయని.. తమను బయటికి రానివ్వడం లేదని.. ఆకలితో చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు విగో వేదికగా పోస్టులు పెడుతున్నారు. దయచేసి సహాయం చేయండంటూ మొత్తుకుంటున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో.. వుహాన్ నగరంలో ఇదే తరహాలో ఆంక్షలు అమలయ్యాయి. ఆ తర్వాత చైనాలో అత్యంత విస్తృత లాక్‌డౌన్‌ ఇదే.