Petrol Price : లీటర్ పెట్రోల్‌పై రూ.25 త‌గ్గింపు! ప్ర‌భుత్వం కొత్త సంవత్సరం కానుక..!!

ప్రభుత్వం వాహనదారులతో పాటు ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పింది. లీటర్ పెట్రోల్ పై రూ.25లు తగ్గించింది.

Petrol Price : లీటర్ పెట్రోల్‌పై రూ.25 త‌గ్గింపు! ప్ర‌భుత్వం కొత్త సంవత్సరం కానుక..!!

Jharkhand Government Has Made A Crucial Decision

Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతగా మండిపోతున్నాయో తెలిసిందే. ఒక్క రూపాయి తగ్గినా ఆహా అనుకునేలా ఉంది. ఈక్రమంలో వాహనదారులకు ఝార్ఖండ్‌ ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. పెట్రోల్‌ ధరలను భారీ తగ్గిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది ఝార్ఖండ్‌ ప్రభుత్వ‌. ఏదో నామమాత్రం తగ్గించాలే అనేలా కాకుండా ఏకంగా లీటరుకు రూ.25లు తగ్గించిది. ఇతర రాష్ట్రాల్లో లాగా కేవలం రూ. 5, రూ. 6 కాకుండా.. ఏకంగా.. లీటర్‌ పెట్రోల్‌ పై రూ.25 తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం. నిత్యావసరాలు ఆకాశంలో ఉన్న ఈ సమయంలో లీటరు పెట్రోల్ కు రూ.25లు తగ్గించటం అంటే ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. కేవలం ఈ శుభవార్త వాహనదారులకే కాదు..రాష్ట్ర ప్రజలందరికి అని గుర్తించాలి. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరిగితే కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి. కారణం ట్రాన్స్ పోర్టు చార్జీలు వినియోగదారుడిపైనే పడతాయి కాబట్టి. మరి పెట్రోల్ రేట్లు తగ్గితే కాస్తో కూస్తో సరుకుల ధరలు కూడా తగ్గుతాయి కదూ..

Read more : Breast Milk Jewellery: తల్లిపాలతో తయారు చేసిన నగలు..!..బిడ్డకు పాలు ఇచ్చే మధురానుభూతులు పదిలం..!!

కాగా..ఝార్ఖండ్‌ కేబినేట్‌ లీటర్ పెట్రోల్ కు రూ.25లు తగ్గించినట్లుగా తీసకున్న ఈ నిర్ణయంపై ఝార్ఖండ్ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈరోజు ఝార్ఖండ్ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం అమలు వెంటనే కాకపోయినా కాస్త ఊరట కలిగించిదనే చెప్పాలి. ప్రభుత్ం తీసుకున్న ఈ నిర్ణయం అమలు కొత్త సంవత్సరం అంటే 2022 జనవరి 26 నుంచి అమలు అవుతాయని ఝార్ఖండ్‌ ముఖ్య మంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. ఇక హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో.. వాహనదారులకు భారీ ఊరట కలుగనుంది. అటు ఝార్ఖండ్‌ వాహనాదారులు కూడా హేమంత్‌ సోరెన్‌ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా… ఇప్పటికే ఒడిషా, ఢిల్లీ, కర్ణాటక, అస్సాం లాంటి చాలా రాష్ట్రాలు.. పెట్రోల్‌ మరియు డీజిల్‌ పై ధరలనున తగ్గిస్తూ… నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అన్ని రాష్ట్రాల కంటే.. ఝార్ఖండ్‌ మాత్రం రూ. 25 తగ్గించడం గమనించాల్సిన విషయం.

Read more : నేను పని చేయలేదు నాకు జీతం వద్దు..!

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనం బయటకు తీయాలంటే భయపడుతున్నారు. లీటర్ పెట్రోల్ సెంచరీ దాటేసి పరుగులు తీసింది. రూ.120 రూ.150 కూడా అమ్మింది. అయితే, గత కొ కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5, డిజిల్ పై రూ. 10 త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం త‌గ్గించ‌ని ధ‌ర‌ల‌కు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధ‌ర‌ల‌ను తగ్గించాయి. తాజాగా ఝార్ఖండ్ ప్రభుత్వం బాటలో ఇతర రాష్ట్రాలు కూడా పయనించే అవకాశాలున్నాయి.

 

jharkhand government has made a crucial decision

jharkhand to cut petrol prices by rs 25 per litre announces cm hemant soren