CM Jagan Honor Kidambi Srikanth : రూ.7లక్షల నగదు, 5ఎకరాల భూమి.. శ్రీకాంత్‌కు సీఎం జగన్ ఘన సన్మానం

ప్రభుత్వం తరఫున శ్రీకాంత్ కు రూ.7లక్షల నగదు బహుమతి అందజేశారు సీఎం జగన్. దీంతో పాటు తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కూడా కేటాయించారు.

CM Jagan Honor Kidambi Srikanth : రూ.7లక్షల నగదు, 5ఎకరాల భూమి.. శ్రీకాంత్‌కు సీఎం జగన్ ఘన సన్మానం

Cm Jagan Honor Kidambi Srikanth

CM Jagan Honor Kidambi Srikanth : భారత స్టార్‌ షట్లర్‌, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన శ్రీకాంత్ సీఎంని కలిశారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా శ్రీకాంత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు సీఎం జగన్. వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో అద్భుత పోరాటం కనబర్చిన శ్రీకాంత్ ను జగన్ అభినందించారు.

ప్రభుత్వం తరఫున శ్రీకాంత్ కు రూ.7లక్షల నగదు బహుమతి అందజేశారు సీఎం జగన్. దీంతో పాటు తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కూడా కేటాయించారు. కాగా, శ్రీకాంత్‌ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ పాల్గొన్నారు.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు స్పెయిన్‌లో 2021 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ పోటీసులు జరిగాయి. ఇందులో రజత పతకం సాధించాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఇవాళ సీఎంని కలిశారు.

Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

సీఎం జగన్ ను కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీకాంత్. సీఎం జగన్ తనను ఓ తమ్ముడిగా పేర్కొన్నారని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని వెల్లడించారు. ఎలాంటి అవసరం వచ్చినా తన కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారని శ్రీకాంత్ తెలిపారు. తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం ఇచ్చారని, ఇప్పటివరకు తనకు ఎంతో సాయపడ్డారని వివరించారు.