Viral video: కెనడాలో భారతీయులుంటే నీకేం ఇబ్బంది..! చైనా మహిళ వీడియోపై నెటిజన్లు ఫైర్
చైనా మహిళ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను కొద్ది గంటల్లోనే 2.7 మిలియన్ల మంది వీక్షించగా.. 2,400 మంది కామెంట్లు చేశారు.

China Woman
chinese woman in canada : కెనడాలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉందని.. కెనడా రోజురోజుకు కెనడియన్ గా మారుతోందని చైనాకు చెందిన ఓ మహిళ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. కెనడాలోని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష స్థలంలో చైనా మహిళ వీడియోను చిత్రీకరించింది. ఈ వీడియోలో భారతీయులే అధికంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది ఆశ్చర్యకరమైన విషయం. కెనడాలో ఇంతమంది భారతీయులు ఉన్నారా అంటూ చైనా మహిళ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
Also Read : Canada: కెనడాలో భారతీయ విద్యార్థులకు డేంజర్ బెల్స్.. ప్రధాని ట్రూడో కీలక ప్రకటన
డ్రైవింగ్ లైసెన్స్ కేంద్రం వద్దనుంచి నేను వీడియోను చిత్రీకరణ చేశానని మహిళ చెప్పింది. నా చుట్టూ కెనడాలో భారతీయులు ఉన్నారు. మీరు చూసేందుకు నేను వీడియో తీశాను. నేను డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష స్థలంలో ఉన్నాను అని ఆమె పేర్కొంది. నేను ఎక్కడ ఉన్నానో ఈ వీడియోలో చెప్పకుండా ఉంటే భారత దేశంలో ఉన్నానేమో అని పొరపాటుపడే అవకాశం కూడా ఉందని ఆ మహిళ చెప్పుకొచ్చింది. కెనడాలో భారతీయుల సంఖ్య భారీగా ఉంది. కెనడా రోజురోజుకు కెనడియన్ గా మారుతోంది అంటూ చైనా మహిళ వ్యాఖ్యానించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చైనా మహిళ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో భారతీయులు ఉంటే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
చైనా మహిళ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను కొద్ది గంటల్లోనే 2.7 మిలియన్ల మంది వీక్షించగా.. 2,400 మంది కామెంట్లు చేశారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రస్తుతం కెనడాకు భారతీయ ఇమ్మిగ్రేషన్ రేటు కొనసాగితే కెనడా క్రమంగా ఇండియా వెస్ట్ అవుతుందంటూ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ కెనడా ప్రభుత్వానికి భారతీయులు కావాలి.. ఇది చైనీస్ ను కోరుకునే దానికంటే ఎక్కువ అంటూ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. కెనడాలో భారతీయులు ఉంటే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ పేర్కొన్నాడు.
కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. 2022లో జారీ చేసిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41శాతం భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. గత నెల భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 13.35లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటుంగా.. ఇందులో 4.27లక్షల మంది కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. 2013 -2022 మధ్య కాలంలో కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 260శాతం పెరగడం గమనార్హం.
A Chinese woman is shocked by the amount of Indians in Canada.
Canada is becoming less Canadian by the day. Everyone is noticing it. pic.twitter.com/dyXIGFrwcO
— iamyesyouareno (@iamyesyouareno) September 25, 2024