China : అక్కడి మహిళల పొడవైన జుట్టు రహస్యం ఏంటంటే?

ఇప్పుడంతా షార్ట్ హెయిర్ ఫ్యాషన్.. కానీ అక్కడ మహిళల పొడవైన జుట్టు చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకోసం వారి దగ్గర ఓ రహస్య ఫార్ములా ఉందట. ఇక విషయం ఏంటంటే 250 మంది మహిళలు తమ పొడవైన జుట్టుతో లాంగ్ హెయిర్ ఫెస్టివల్ నిర్వహించారు.

China : అక్కడి మహిళల పొడవైన జుట్టు రహస్యం ఏంటంటే?

China

Updated On : May 30, 2023 / 5:31 PM IST

China Long Hair China Long Hair : చైనాలో మహిళలు తమ పొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 250 మంది మహిళలు ఒక చోటుకు చేరి తమ పొడవాటి జుట్టుతో ప్రదర్శన ఇచ్చారు.

Diabetes Oral Insulin : మధుమేహానికి ఓరల్ ఇన్సులిన్.. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో

చైనాలోని గుయిలిన్ లాంగ్ షెంగ్ అటానమస్ కౌంటీ హువాంగ్లూయో యావో గ్రామంలో పలు గ్రామాలకు చెందిన మహిళలు లాంగ్ హెయిర్ ఫెస్టివల్ నిర్వహించారు. తమ సంస్కృతిలో భాగంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పే ప్రయత్నం చేశారు. అందమైన దుస్తులు ధరించిన మహిళలు మూన్ ఐలాంగ్‌కు వెళ్లి నది ఒడ్డున నిలబడ్డారు. 256 మంది రెడ్ యావో మహిళలు తమ జుట్టుతో 456 మీ( 1,496 అడుగులు) గొలుసుగా ఏర్పడి తమ జుట్టును చెక్క దువ్వెనలతో దువ్వడం మొదలుపెట్టారు.

 

పూర్వకాలం నుంచి పొడవైన జుట్టుని కలిగి ఉండటం ఇక్కడి మహిళకు సంప్రదాయంగా వస్తోంది. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇక్కడి మహిళలు జుట్టు కత్తిరించుకుంటారట. పొడవైన జుట్టు సంపదని, శ్రేయస్సుని, అదృష్టాన్ని ఇస్తుందని వీరు నమ్ముతారట. ఇక వీరి జుట్టు ఆరోగ్యంగా పెరగడం వెనుక రహస్యం కూడా దాగి ఉందట. ఇక్కడ పల్లెల్లో కనిపించే వృద్ధుల్లో కూడా తెల్ల వెంట్రుకలు కనిపించడం అరుదట.

Love Holidays in China : యువతకు ‘ప్రేమపాఠాలు’ నేర్పుతున్న చైనా ప్రభుత్వం..! ప్రేమించుకోవటానికి విద్యార్ధులకు సెలవులు..!!

ఇప్పుడు దొరికే షాంపూలను కాకుండా ద్రాక్షపండు తొక్క, టీ ఆయిల్ డ్రెగ్స్ మరియు మూలికల రహస్య మిశ్రమాన్ని బాగా పులిసిపోయిన బియ్యం నీటిలో వేసి.. దానిని మరిగించి చల్లబడిన తర్వాత జుట్టుని కడగటానికి వాడతారట. ఇది జుట్టును మృదువుగా, నల్లగా, మెరిసేలా చేస్తుందట. ఇక వీరంతా ఇక్కడ చేరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నం నెరవేరాలని ఆశిద్దాం.