ఇది ఆ పార్టీ పనే : ఫిలిప్ఫైన్స్ అధ్యక్షుడిపై బొద్దింక వదిలారు!
ఫిలిప్ఫైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టి (74) పార్టీ క్యాంపెయిన్ ర్యాలీలో బిజీగా ఉన్నారు. సెంట్రల్ బొహల్ ప్రావియన్స్ లో సెనేట్ అభ్యర్థులతో సమావేశమయ్యారు.

ఫిలిప్ఫైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టి (74) పార్టీ క్యాంపెయిన్ ర్యాలీలో బిజీగా ఉన్నారు. సెంట్రల్ బొహల్ ప్రావియన్స్ లో సెనేట్ అభ్యర్థులతో సమావేశమయ్యారు.
ఫిలిప్ఫైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టి (74) పార్టీ క్యాంపెయిన్ ర్యాలీలో బిజీగా ఉన్నారు. సెంట్రల్ బొహల్ ప్రావియన్స్ లో సెనేట్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. అందరూ ఆయన ప్రసంగాన్నే ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో అదే అదనుగా భావించిన ఓ బొద్దింక మెల్లగా పాకుతూ పొడియం దగ్గరకు వచ్చింది.
పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తున్నరొడ్రిగో చొక్క వెనుక నుంచి ఎడమ భుజంపై బొద్దింక పాకుతూ వచ్చింది. చేతివేలు సైజు ఉన్న బొద్దింకను చూసి పక్కనే ఉన్న ఓ యువతి పేపర్ ముక్కతో బొద్దింకను తీసేందుకు ప్రయత్నించింది. అది గమనించిన అధ్యక్షుడు రొడ్రిగో ప్రసంగం ఆపి.. తన చేత్తో ఆ బొద్దింకను కిందికి విసిరి కొట్టారు.
ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ.. ప్రధాన ప్రతిపక్షమైన లిబరల్ పార్టీనే ఈ బొద్దింకను తనపై ఊసిగొల్పి ఉంటారని చమత్కరించారు. ‘అవును.. అది లిబరల్ వాళ్ల పనే.. నిజం.. చూస్తుంటే ఈ బొద్దింక లిబరల్ సపోర్ట్ లా కనిపిస్తోంది.’అని అనడంతో అక్కడి వారి ముఖంలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఆ తర్వాత తన ప్రసంగాన్ని ఏక ధాటిగా రెండు గంటల పాటు కొనసాగించారు. అధ్యక్షుడు రొడ్రిగో భుజంపై బొద్దింక పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..