Cockroach milk: భవిష్యత్తులో మనం బొద్దింక పాలను తాగుతామా? ఆవు పాల కంటే బెటర్.. అంతేకాదు..
జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లాగ్రఫీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలోని వివరాలు బయటకు వచ్చాయి.

బొద్దింకను చూస్తేనే చీదరించుకుంటాం. అని పాదలపైకి ఎక్కితే భయపడి గట్టిగా అరుస్తాం. ఇంట్లో బొద్దింకలు ఉండకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మనం తినే ఆహారంలో బొద్దింక కనపడితే నానా గొడవ చేస్తాం.
అయితే, బొద్దింకలతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. బొద్దింక పాలలో ఆవు, గేదె పాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని తేల్చారు.
జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లాగ్రఫీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలోని వివరాలు బయటకు వచ్చాయి. బొద్దింక పాలలో గేదె పాల కంటే మూడు రెట్లు అధిక కేలరీలు ఉన్నాయని దీని ద్వారా తెలిసింది. బొద్దింక పాలలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వులు, చక్కెరలు ఉన్నాయని చెప్పారు.
Also Read: సునీతా రిటర్న్ జర్నీకి రెడీ .. ఇంకో 10 రోజులే.. భూమ్మీదికి వచ్చాక ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్‌లో పరిశోధనకు నాయకత్వం వహించిన సుబ్రమణియన్ రామస్వామి ఇందుకు సంబంధించిన పలు వివరాలు తెలిపారు.
బొద్దింక పాలు ఒకేసారి కాకుండా కాలక్రమేణా క్రమంగా శక్తిని అందిస్తాయని అన్నారు. ఇది శరీరానికి దీర్ఘకాలిక పోషకాలు అందించడానికి మంచి వనరుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉన్నాయని, అన్ని పోషకాలలు ఉన్నాయని తెలిపారు.
పోషకాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించడంతో దీనిపై భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరగవచ్చు. ప్రస్తుతం పరిశోధనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు వాటి పిల్లల కోసం పాల లాంటి ద్రవాన్ని వదులుతుంటాయి.
వాటి కడుపులో పసుపు రంగు పాలంలాంటి పదార్థాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాలు ఆవు పాల కంటే శ్రేష్ఠమైనవని తేల్చారు. కణాల పెరుగుదలతో పాటు కణాల క్షీణతను సరి చేసుకునేందుకు సాయపడే ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉన్నాయని గుర్తించారు.