Bullfight Stadium Collapse : కొలంబియాలో కుప్పకూలిన బుల్ ఫైట్ స్టేడియం..ఆరుగురు మృతి

కొలంబియాలో బుల్ ఫైట్ స్టేడియం. కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

Bullfight Stadium Collapse : కొలంబియాలో కుప్పకూలిన బుల్ ఫైట్ స్టేడియం..ఆరుగురు మృతి

Bullfight Stadium Collapse In Colombia (1)

Updated On : June 27, 2022 / 1:47 PM IST

bullfight Stadium Collapse In Colombia : అది కొలంబియాలోని బుల్ ఫైట్ స్టేడియం. అప్పటి వరకు బుల్ ఫైట్ చూపరులను ఎంతగానో రక్తికట్టించింది. అందరు బుల్ ఫైట్ చూడ్డటంలో మునిగిపోయారు. ఇంతలోను ఎవ్వరూ ఊహించని ఘటన జరిగిపోయింది. బుల్ ఫైట్ స్టేడియంలోని ఓ పక్క ఉన్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలోఆరుగురు వ్యక్తులు మరణించారు.మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే జరగాల్సింది అంతా జరిగిపోయింది. భయంతో జనాలు అరుపులు.. కేకలు.. పరుగులు. ఎవరు ఎటు వైపు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కుటుంబాలతో సహా స్టేడియానికి వచ్చిన వారందరు చెల్లా చెదురు అయ్యారు.

బోగోటాకు నైరుతి దిశలో 100 మైళ్ల దూరంలో ఉన్న కొలంబియాలోని ఎల్ ఎస్పినల్‌లో జరిగిన ఎద్దుల పోటీని వీక్షించడానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం (జూన్ 26,2022)వీక్‌ ఎండ్‌ కావడంతో జనాలు విపరీతంగా వచ్చారు. ఫైట్‌ జరుగుతుండగానే అకస్మాత్తుగా ఒక వైపు మొత్తం స్టేడియా కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు చనిపోయారు.

గాయపడ్డ వారు మాత్రం 5వందలకు పైనే ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న సహాయక బృందాలు.. స్టేడియం శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.