పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారత ఖైదీలు 

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 02:20 AM IST
పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారత ఖైదీలు 

ఢిల్లీ : పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 483 మంది జాలర్లు, 54 మంది సాధారణ వ్యక్తులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్తాన్ భారత జాలర్లను పలుమార్లు అరెస్టు చేసింది. కాగా మనదేశ జైళ్లలో 347 మంది పాకిస్థానీయులు ఉన్నారు. వీరిలో 249 మంది సాధారణ పౌరులు, 98 మంది జాలర్లు ఉన్నారు. 

2008 మే 21లో చేసుకున్న ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం..ప్రతి ఏడాది జనవరి 1, జులై 1న రెండు సార్లు ఆయా దేశాల జైళ్లలో ముగ్గుతున్న ఖైదీల జాబితాను రెండు దేశాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఖైదీల జాబితాను జనవరి 1 మంగళవారం ఇరు దేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. భారతీయుల విడుదలను వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ ను కోరింది. శిక్ష పూర్తి చేసుకున్న 80 మంది పాకిస్తాన్ ఖైదీలను త్వరగా స్వదేశానికి తీసుకెళ్లాలని సూచించింది.

పాక్ జైళ్లలో ఉన్న భారత ఖైదీల వివరాలను ఇస్లామాబాద్ లోని భారత దౌత్యకార్యాలయం భారత్ కు అందించింది. ఒప్పందం ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు విదేశీ కార్యాలయం తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ తో భారత్ జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను ఆ దేశం ఇవ్వనుంది.

దీంతో ఇరు దేశాల జైళ్లలో బందీలుగా ఉన్న ఖైదీలకు విముక్తి కల్గనుంది. ఖైదీల విడుదలకు ఇరు దేశాలు అంగీకరిస్తే.. పాకిస్తాన్ లో శిక్ష అనుభవిస్తున్న భారతీయులు, భారత్ లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీయులు తమ తమ దేశాలకు వెళ్లనున్నారు.