Early Delivery : గర్భిణులకు కరోనా సోకితే నెలలు నిండకుండానే ప్రసవం

అమ్మ కడుపులో పెరిగే శిశువుల పుట్టుక సమయాన్ని త్వరపెడుతోంది కరోనా మహమ్మారి. గర్భిణులకు కరోనా సోకితే ప్రసవం త్వరగా జరిగే అవకాశం ఉంటుందని అమెరికా పరిశోధల్లో వెల్లడైంది.

Early Delivery : గర్భిణులకు కరోనా సోకితే నెలలు నిండకుండానే ప్రసవం

Early Delivery

Updated On : August 11, 2021 / 2:55 PM IST

pregnant women..Possibility of early delivery : కరోనా. ప్రపంచాన్ని గడగడలాడించే వైరస్ బిడ్డల పుట్టుకను కూడా ప్రశ్నార్థం చేస్తోంది. అమ్మ కడుపులో పెరిగే శిశువుల పుట్టుక సమయాన్ని త్వరపెడుతోంది కరోనా మహమ్మారి.గర్భిణులకు కరోనా సోకితే ప్రసవం త్వరగా జరిగే అవకాశం ఉంటుందని అమెరికా పరిశోధల్లో వెల్లడైంది.అంటే నెలలు నిండకుండానే ప్రసవం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు సైంటిస్టులు. ‘ద లాన్సెట్ రీజినల్ హెల్త్’లో ప్రచురితమైన కథనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గర్భం ధరించిన 32 వారాలులోపే కాన్పు జరిగే అవకాశాలు 60 శాతం ఉన్నాయని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేలిన విషయాన్ని వెల్లడించారు. 37 వారాల లోపు ప్రసవం జరిగేందుకు 40 శాతం అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించారు. అలాగే గర్భం ధరించిన మహిలలకు కోవిడ్ -19తో పాటు మధుమేహం, ఊబకాయం లాంటిసమస్యలు కూడా ఉంటే ఈ ప్రమదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

అటువంటి సమ్యలు ఉన్నవారికి నెలలు నిండకుండానే కాన్పు జరిగే అకాశాలు 160 శాతం ఉన్నాయని ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన సైంటిస్టు డొబోరా కారాసెక్ వివరించారు. కాబట్టి ఇటువంటి సమస్య నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.