కరోనా ఎఫెక్ట్ : ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం…పలు దేశాలకు విమానాలు రద్దు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 03:53 AM IST
కరోనా ఎఫెక్ట్ : ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం…పలు దేశాలకు విమానాలు రద్దు

Updated On : March 14, 2020 / 3:53 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయిల్, శ్రీలంకకు వెళ్లే విమాన సేవలు తగ్గించింది. ఈ మేరకు శనివారం సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది. లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ 139 దేశాలకు పాకింది. భారత్ ఇద్దరు కరోనా వైరస్ సోకి మృతి చెందినట్లు నిర్ధారించారు. 

ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఆమె కరోనాను జయించలేకపోయింది. పశ్చిమబెంగాల్‌లో ఉండే ఆమెకు కొడుకు ద్వారా వైరస్ సోకింది.(కరోనా ఎఫెక్ట్ : ప్రేక్షకులు లేకుండానే ఆసీస్-కివీస్ వన్డే )

గురువారం కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాతి రోజే మహిళ చనిపోయింది. దీంతో భారత్‌లో కరోనా కేసులు 85కు చేరాయి. కేరళలో కరోనా సోకిన వ్యక్తులు ముగ్గురు డిశ్చార్జి కాగా, మరో ఏడుగురి పరిస్థితి చక్కబడిందని వారిని కూడా ఇంటికి త్వరలోనే పంపేస్తామని వైద్యులు చెబుతున్నారు.
 

Also Read | రూ.1 కే చికెన్ బిర్యానీ