Corona Virus : జాంబి వైరస్ లా కరోనా వ్యాప్తి.. మృతదేహం నుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి భయంకర వాస్తవం వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుంచి వైరస్.. జాంబి వైరస్ లా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వెల్లడైంది.

Corona Virus : జాంబి వైరస్ లా కరోనా వ్యాప్తి.. మృతదేహం నుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం

Corona virus

Updated On : December 19, 2022 / 8:14 AM IST

Corona virus : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి భయంకర వాస్తవం వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుంచి వైరస్.. జాంబి వైరస్ లా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వెల్లడైంది. కరోనా వైరస్ తో మృతి చెందిన వారి మృతదేహం నుంచి పోస్టుమార్టం నిర్వహించిన 17 రోజుల వరకు జాంబి వైరస్ లా కరోనా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని జపాన్ పరిశోధకులు కనుగొన్నారు.

కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం ముక్కు, ఊపరితిత్తుల్లో ఉన్న వైరస్.. పోస్టుమార్టానికి ఉపయోగించిన వాయువుల ద్వారా బతికి ఉన్నవారికి వ్యాపిస్తుందని గుర్తించారు. ఎలుకలపై పరిశోధన నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని కనుగొన్నారు. అయితే దీని వల్ల సాధారణ ప్రజలకు పెద్దగా ప్రమాదం లేకపోయినా.. పోస్టుమార్టం నిర్వహించే సిబ్బందికి మాత్రం కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిర్ధారించారు.

Corona Cases in China: చైనాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. లక్షలాది కేసులు వచ్చే ముప్పు

అంతేకాకుండా మృతదేహంపై పడి ఏడ్చే కుటుంబసభ్యులు, బంధువులకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి ముక్కు, చెవులు, పురీషనాళాన్ని కాటన్ ప్యాడ్స్ తో మూసివేస్తే ఈ ముప్పు నుంచి బయట పడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.